Attack on Prabhakar Reddy: ప్రతిపక్షాలు దిగజారిపోయి మాట్లాడుతున్నాయి: హరీష్ రావు

ఎన్నికల ప్రచారంలో ఉండగా కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి గురించి తెలిసిందే. పేగులకు రంధ్రం పడటం.. ఆపరేషన్ కూడా జరిగింది. ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2023, 04:30 PM IST
Attack on Prabhakar Reddy: ప్రతిపక్షాలు దిగజారిపోయి మాట్లాడుతున్నాయి: హరీష్ రావు

Attack on Prabhakar Reddy: నిన్న ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంపి, దుబ్బాక నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి పై కత్తితో జరిగిన దాడి గురించి మన అందరికి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ రెడ్డిని ఈ రోజు మంత్రి హరీష్ రావు పరామర్శించారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన మాట్లాడిన మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.. హరీష్ రావు మాట్లాడుతూ.. నేను ఇపుడే ప్రభాకర్ రెడ్డిని ఆసుపత్రిలో పరామర్శించాను.. ప్రభాకర్ రెడ్డి గారి ఆరోగ్యం కొంత మేరకు నిలకడగా ఉంది. వైద్యులు నిరంతరం ఆరోగ్యం పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ విషయంపై సీనియర్ నాయకులు కూడా చిల్లర కామెంట్స్ చేయటం విడ్డురంగా అనిపిస్తుంది. ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని కొడికత్తి అని రాజకీయాలు అపాహస్యం చేస్తున్నారు. అపహాస్యం చేసిన ప్రతి ఒక్కడికి చెప్తున్నా..  బీఆర్ఎస్ పార్టీకి అలాంటి అవసరం అసలు లేదు. 

ఒక ప్రజానాయకుడిపై హత్యాయత్నం జరిగి.. కడుపులో చిన్న పేగు నాలుగు చోట్ల రంధ్రాలు పడితే, తొలగిస్తే ఇంత చిల్లర మాటలు మాట్లాడుతారా..కోడికత్తి అని అవహేళన చేస్తారా..? ప్రభాకర్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించాల్సిపోయి.. ప్రతిపక్షాలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాయి. ఒక ప్రజానాయకుడిపై హత్యాయత్నం జరిగిన ఘటనపై .. దిగజారిపోయి మాట్లాడుతున్నాయి.

వైద్యులు 15 సెంటి మీటర్లు కడుపు తెరచి..  సర్జరీ చేసి పేగు కట్ చేసి తొలగించారు. ఇంతటి మేజర్ సర్జరీ జరిగిన ఈ రకంగా మాట్లాడటం దివాలకోరు రాజకీయం అనే చెప్పాలి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాల్ డేటా పోలీసులు సేకరిస్తున్నారు.. వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఒకటి రెండు రోజుల్లో కుట్ర కోణం చేధిస్తారని ఆశిస్తున్నా
తెలంగాణలో ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చూడలేదు. ఇలాంటి హత్యా రాజకీయాలను రాయలసీమ, బీహార్ లో చూశాం. 

Also Read: PM Kisan Scheme: రైతులకు దీపావళి కానుక.. త్వరలోనే పీఎం కిసాన్ నిధులు జమ  

ఇన్నేళ్ల చరిత్రలో ఎన్నికల సమయంలో ఇలా దాడులు లేవు.. వ్యక్తుల పై కేసులు పెట్టే ప్రయత్నం లేదు. పనితనం తప్ప పగతనం లేని నాయకుడు కేసీఆర్ అలా పగ ఉంటే ఇప్పటికీ ఎంతో మంది జైళ్లలో ఉండేవారు. 
కాంగ్రెస్ నాయకులు హౌసింగ్ స్కాంలో వందల కోట్లు మెక్కారు. అందరినీ లోపల వేసేవాళ్ళం. అలా ఓటుకు నోటు కేసు ఉంది. ఏనాడు ఇలాంటివి మేము పాల్పడలేదు. ఏదేమైనా ఇలాంటివి జరగటం దురదృష్టకరం. ప్రతి పక్షాలు అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ ఇలాంటివి హర్షించదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. న్యాయవ్యవస్థ పై మాకు నమ్మకం ఉందని హరీష్ రావు తెలిపారు. 

Also Read: iPhone Tapping: దేశంలో ఫోన్ ట్యాపింగ్ దుమారం, ఫోన్లు హ్యాక్ అవుతున్నాయంటూ అలర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News