PM Kisan Scheme: రైతులకు దీపావళి కానుక.. త్వరలోనే పీఎం కిసాన్ నిధులు జమ

PM Kisan 15th Instalment Latest Updates: పీఎం కిసాన్ 15వ విడత నిధులు లబ్ధిదారుల ఖాతాలో త్వరలోనే జమ కానుంది. దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం నిధులు జమ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫండ్స్ జమ అయ్యేందుకు రైతులు ముందుగా ఈకేవైసీని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2023, 03:17 PM IST
PM Kisan Scheme: రైతులకు దీపావళి కానుక.. త్వరలోనే పీఎం కిసాన్ నిధులు జమ

PM Kisan 15th Instalment Latest Updates: దేశవ్యాప్తంగా అన్నదాతలకు దీపావళికి కేంద్ర ప్రభుత్వం కానుక ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద 15వ విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, దీపావళి పర్వదినం నేపథ్యంలో కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా లబ్ధిదారులకు రూ.8 వేలు పెంచేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.6 వేలు అందజేస్తున్న విషయం తెలిసిందే. రూ.2 వేలు చొప్పున మూడు వాయిదాల్లో నేరుగా రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు 14 విడతలుగా నగదు జమ చేయగా.. 15వ విడత నిధుల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. 14వ విడత నిధులు జూలై నెలలో విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.

నవంబర్ 12న దీపావళి పర్వదినం ఉండగా.. అంతకుముందే రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దేశంలో 8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అయితే రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈకేవైసీ కంప్లీట్ చేయని రైతులకు అకౌంట్‌లో డబ్బులు జమ అవ్వవని స్పష్టం చేశారు.

ఈకేవైసీ ఇలా పూర్తి చేయండి..

==> ముందుగా అధికారిక https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
==> 'e-KYC' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> మీ ఆధార్ నంబర్, ఇతర అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయండి.
==> మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే.. ఈ కేవైసీ కంప్లీట్ అవుతుంది.

కొత్త దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఇలా చేయండి..

==> ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లండి
==> ఇక్కడ న్యూఫార్మర్ రిజిస్ట్రర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> దరఖాస్తు చేసుకోవడానికి లాంగ్వేజ్‌ను సెలక్ట్ చేసుకోండి. 
==> మీరు పట్టణ ప్రాంతంలోని రైతు అయితే.. అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ని ఎంచుకోండి. 
==> మీరు గ్రామీణులైతే గ్రామీణ రైతు రిజిస్ట్రేషన్‌ని ఎంచుకోండి. 
==> ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, రాష్ట్రం సెలక్ట్ చేసుకోండి. 
==> మీ భూమి వివరాలను నమోదు చేయండి
==> మీ డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేసి.. సేవ్ బటన్‌పై క్లిక్ చేయండి. 
==> క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ OTPకి వెళ్లి సబ్మిట్ చేయండి.
==> మీ మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే.. మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ కంప్లీట్ అవుతుంది.

Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

 Also Read: Minister Harish Rao: ఎంపీ ప్రభాకర్‌ రెడ్డిపై కోడికత్తి దాడి అంటూ అపహాస్యం.. మంత్రి హరీష్ రావు కౌంటర్.!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News