BRS Manifesto Highlights: ఎన్నికలకు సమరశంఖం పూరించారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా 51 మంది అభ్యర్థులకు బీఫామ్‌లు అందించారు. ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చెక్ కూడా అందజేశారు. రేపు మిగతా అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేస్తామన్నారు. ప్రగతిభవన్‌లో బీఫామ్‌లు తీసుకోవాలన్న కేసీఆర్ సూచించారు. టికెట్ రానివారు తొందరపడొద్దని.. ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని చెప్పారు. అభ్యర్థులందరూ సంయమనంతో ఉండాలని.. కోపతాపాలను అభ్యర్థులు పక్కనపెట్టాలని కోరారు. ప్రతీకార్యకర్త దగ్గరకు అభ్యర్థులు వెళ్లాలని.. చిలిపి పనులతో కొందరు అవకాశాలు కోల్పోయారని అన్నారు. బీఆర్‌ఎస్‌పై విపక్షాలు కుట్రలు చేస్తాయని.. ప్రజల్లో గెలిచినా సాంకేతిక అంశాలతో కుట్ర చేస్తారని గుర్తు చేశారు. ప్రతి విషయంపై అభ్యర్థులు క్లారిటీతో ఉండాలన్నారు. ఆదివారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మేనిఫెస్టో ఇలా..
==> కేసీఆర్ బీమా పేరుతో కొత్త ప్రథకం ప్రకటన
ఈ స్కీమ్ కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు బీమా.. ఎల్‌ఐసీ ద్వారా అమలు
==> రైతు బంధు పథకం ఎకరానికి రూ.10,000 నుంచి రూ.16,000 వేలకు పెంపు
మొదటి సంవత్సరం ఎకరానికి రూ.12,000 చొప్పున ఇచ్చి పెంచుతూ రూ.16,000 ఇస్తాం.
==> సామాజిక పెన్షన్లు రూ.5 వేలకు పెంపు
అధికారంలోకి మొదటి సంవత్సరం రూ.3016తో ప్రారంభించి వచ్చే 5 సంవత్సరాల్లో రూ.5016 చేస్తాం..
==> దివ్యాంగుల పెన్షన్ రూ.4016 నుంచి రూ.6016 పెంపు
==> అర్హులైన లబ్దిదారులకు, అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్
==> తెలంగాణ అన్నపూర్ణ స్కీమ్ కింద
==> సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేలు అందజేత
==> తెల్లరేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ
==> ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.15 లక్షలకు పెంపు
==> జర్నలిస్టులకు ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఉచిత వైద్యం అందేలా చేస్తాం..
==> ప్రభుత్వం ఆసుపత్రిలో బిల్లులు కడుతుంది..
==> 'కేసీఆర్ ఆరోగ్య రక్ష' పేరుతో జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు వైద్యం..
==> అగ్రవర్ణ పేద పిల్లలకు' 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయం..
==> అసైన్డ్ భూములకు ఆంక్షలను ఎత్తివేసి అమ్మకం హక్కులు
==> అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఇళ్ల స్థలాలు
==> మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట.. బడ్జెట్ పెంపు
==> ధాన్యం కొనుగోలు పాలసీని యాథావిధిగా కొనసాగిస్తాం..
==> గిరిజనేతరులకు కూడా పోడుభూములు అందజేస్తాం..
==> హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం
==> స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలన్నింటికీ సొంత భవనాలు నిర్మిస్తాం..
==> ఉద్యోగులకు పాత పెన్షన్ కొనసాగింపుపై ప్రత్యేక కమిటీని నియమిస్తాం..
==> అనాథలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీని తీసుకువస్తాం..
Also Read: Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి