CM KCR: చేతగాని దద్దమ్మలు కత్తి పోట్లకు ఒడిగట్టారు.. నాపై దాడిగానే భావిస్తా..: సీఎం కేసీఆర్

CM KCR On MP Kotha Prabhakar Reddy Incident: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు సీఎం కేసీఆర్. తనపై దాడిగానే భావిస్తున్నామని అన్నారు. మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు.    

Written by - Ashok Krindinti | Last Updated : Oct 30, 2023, 06:26 PM IST
CM KCR: చేతగాని దద్దమ్మలు కత్తి పోట్లకు ఒడిగట్టారు.. నాపై దాడిగానే భావిస్తా..: సీఎం కేసీఆర్

CM KCR On MP Kotha Prabhakar Reddy Incident: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడిపై సీఎం కేసీఆర్ స్పందించారు. దేవుడి దయ వల్ల అతనికి అపాయం లేదని అన్నారు. నారాయణ ఖేడ్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లారని.. మీ కోసం ఇక్కడికి  తాను వచ్చినట్లు ఆయన తెలిపారు. మొండి కత్తో, లండు కత్తో మనకు దొరకదా మనకు దాడి చేయరాదా..? అని అన్నారు. కండ్లల్ల నిప్పులు పోసుకుని కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా దాడులు చేసే వారికి ఓటుతో వారందరికీ బుద్ది చెప్పాలని కోరారు. శత్రువులను కూడా మనం ఇబ్బంది పెట్టలేదని.. చేతగాని దద్దమ్మలు కత్తి పోట్లకు ఒడిగట్టారని అన్నారు. 

ఈ దాడి అరాచకం.. దుర్మార్గం అని సీఎం కేసీఆర్ అన్నారు. గెలిపిస్తే పనిచేయాలని.. కానీ గుండాయిజం చేయొద్దన్నారు. ఇది తనపై జరిగిన దాడిగా భావిస్తామన్నారు. హింసా రాజకీయాలను తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. తనకు ఇంకా మాట్లాడాలని ఉందని.. కానీ ఎంపీ మీద దాడి చేయడంతో తాను ఆసుపత్రికి వెళుతున్నట్లు చెప్పారు. నారాయణ్‌ ఖేడ్‌ అభ్యర్థి భూపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

కాగా.. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రి బయట మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభాకర్ రెడ్డి కోలుకోవాలంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డికి శస్త్ర చికిత్స జరుగుతోందని తెలిపారు. కత్తి గాటుతో శరీరంలో లోపల బ్లీడింగ్ అయినట్టు వైద్యులు గుర్తించారని చెప్పారు. దాదాపు రెండు గంటల పాటు శాస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారని వెల్లడించారు. రాజకీయాల్లో హత్య రాజకీయాలు పనికి రావని.. ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలన్నారు. కానీ ఇలా హత్య రాజకీయలు చేయడం సరికాదని హితవు పలికారు. 

"బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. హత్య రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికదాడులకు దిగడం సరికాదు. ఎన్నికలను ఎదుర్కోలేక ఇలాంటి సంఘవిద్రోహక చర్యలకు పాల్పడడాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సహించబోరు. తస్మాత్ జాగ్రత్త.." అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. 

Also Read: Nara Lokesh: కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేష్‌ బహిరంగ లేఖ   

Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News