Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్

Vizianagaram Train Accident Latest Updates: విజయనగరం జిల్లాలో ఆగి ఉన్న రాయగడ ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టడంతో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 29, 2023, 10:05 PM IST
Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్

Vizianagaram Train Accident Latest Updates: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద అలమండ-కంటకాపల్లి వద్ద ఆగి ఉన్న పలాస ప్యాసింజర్ రైలును రాయగడ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  ప్యాసింజర్ నాలుడు బోగిలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. అధికారులు రంగంలోకి సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ప్రమాద స్థలంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఆ ప్రాంతం అంతా చీకటిగా మారింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఓవర్ హెడ్ కేబుల్ తెగడంతో విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు నిలిచిపోగా.. పలాస ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు.

==> ఈ ప్రమాదంలో 10 మంది గాయపడినట్లు అధికారిక సమాచారం
==> ఘటనా స్థలానికి చేరుకున్న DRM
==> యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు
==> స్థానిక ప్రభుత్వ అధికారులు, NDRF సహాయం కోరిన రైల్వే 
==> సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక అధికారులు

 

Trending News