CM KCR: మీ తలరాతను మార్చే ఆయుధమే ఓటు.. అభివృద్ధికే పట్టం కట్టండి: సీఎం కేసీఆర్

CM KCR Praja Ashirvada Sabha Meetings: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ సీఎం కేసీఆర్ జోరు పెంచుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్‌ మరోసారి పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నారు. నేటి ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2023, 04:36 PM IST
CM KCR: మీ తలరాతను మార్చే ఆయుధమే ఓటు.. అభివృద్ధికే పట్టం కట్టండి: సీఎం కేసీఆర్

CM KCR Praja Ashirvada Sabha Meetings: 75 ఏండ్ల ప్రజాస్వామ్య భారతంలో రావాల్సినంత రాజకీయ పరిణత రాలేదని.. అలా వచ్చిన దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. మన దేశంలో ఎన్నికలు వచ్చాయంటే అంతా గందరగోళంగా ఉంటుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును, మీ తలరాతను మార్చే ఆయుధమే ఓటు అని.. తక్కువ సమయంలో ఎంతో అభివృద్ధిని చేసినవారికే వేయాలని కోరారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బీఆర్ఎస్ మీ కండ్ల ముందు పుట్టిన పార్టీ అని.. 15 ఏండ్లు పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ సాధించిందని అన్నారు. మన తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపి మనలని అరిగోస పెట్టింది కాంగ్రెస్ అని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

==> నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కనీసం మంచినీళ్లు, సాగునీళ్లు, కరెంటు ఇవ్వలేదు. పైగా చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు జరిగేలా దుర్మార్గంగా పాలించింది.
==> 969 లో తెలంగాణ ఉద్యమం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది.
==> 2004 లో తెలంగాణ ఇస్తామని చెప్పి మనతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చాక ఇవ్వకుండా మోసం చేసినారు.
==> ఉద్యోగస్తులందరినీ కూడా రోడ్ల మీదికి బాటలు పట్టే పరిస్థితిని కాంగ్రెస్ కల్పించింది.
==> ‘కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ తెచ్చుడో’ అని నేను ఆమరణ దీక్ష చేపడితే ఇక తప్పదని ప్రకటన చేసిండ్రు.
==> మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదట పేదల సంక్షేమం చేసినాం.
==> కేవలం రూ.200 గా ఉన్న పెన్షన్ ను మొదటి వెయ్యి రూపాయలకు, తర్వాత రెండు వేలకు పెంచుకున్నాం. ఎన్నికల తర్వాత ఐదు వేలకు చేస్తాం.
==> చరిత్రలో ‘కంటి వెలుగు’ అనే ప్రోగ్రాం వస్తుందని కనీసం ఎవరన్నా ఊహించిండ్రా? 
==> గ్రామాల్లో ఉన్న పేదలు, వృద్ధులనైతే చాలామంది కొడుకులు, బిడ్డలే సరిగ్గా చూసుకోరు. కండ్లు మసక అయినయి అద్దాలు కావాలె బిడ్డా అంటే.. నువ్వు ఏమన్నా రాజ్యమేలేది ఉందా అంటరు. ఆ పరిస్థితిని గుర్తించినం.
==> ప్రతి వార్డుకు, ప్రతి గ్రామానికి వైద్యుల బృందాలను పంపించి రాష్ట్రంలో 3 కోట్ల మందికి పరీక్షలు చేసి, 80 లక్షల మందికి ఉచితంగా కండ్లద్దాలను ఇచ్చినం.
==> గతంలో గర్బిణీలు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తే పిచ్చి అబార్షన్లు చేసి దోచుకునేది.
==> ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, అబ్బాయి అయితే రూ.12 వేలతో పాటుగా ‘కేసీఆర్ కిట్’నూ అందజేస్తున్నాం. 
==> రైతులకు ఫ్రీగా 24 గంటల నాణ్యమైన కరెంటును ఇస్తున్నాం.
==> రైతుబంధు పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ.
==> కొంత నష్టమొచ్చినా రైతులు పండించిన పంటను రైతుల దగ్గరికే వెళ్లి ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది.
==> దురదృష్ణవశాత్తు మరణించిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షల బీమాను అందిస్తున్నాం.
==> పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘రైతు బంధు’ వేస్ట్ అంటున్నడు. ఉండాల్నా? వద్దా?
==> బీఆర్ఎస్‌ను గెలిపిస్తే ఎకరానికి పదివేలున్న రైతుబంధును పదహారు వేలకు పెంచుతాం.
==> మనకోసం యుద్ధం చేసేవాళ్లకే కత్తి ఇవ్వాలి. మన బీఆర్ఎస్ అభ్యర్థులకే మన ఓటు వేయాలి.
==> కాంగ్రెసోల్లు ఉన్ననాడు కరెంటు ఇయ్యలేదు. సగం కరెంటు ఇస్తే షాక్ కొట్టి, పామలు కరిచి అనేకమంది రైతులు చనిపోయిండ్రు.
==> ‘ధరణి’ తీసి బంగాళాఖాతంలో వేస్తమంటున్నరు కాంగ్రేసోల్లు. భట్టి విక్రమార్క టీవీలల్ల చెబుతున్నడు. రాహూల్ గాంధీ మీటింగ్ లల్ల చెబుతున్నడు. జాగ్రత్త.
==> మైనార్టీలను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎల్లప్పుడూ ఓటు బ్యాంకుగానే చూసింది.
==> గత కాంగ్రెస్ పదేండ్లలో మైనార్టీల కోసం రూ.2000 కోట్లను మాత్రమే ఖర్చు చేస్తే.. మన బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో రూ.12000 కోట్లను ఖర్చు చేసింది.
==> గత కాంగ్రెస్ హయాంలో ప్రతిరోజూ ఘర్షణలే..గడబిడలే. కర్ఫ్యూలే. కానీ మన పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క కర్ఫ్యూ లేదు. ప్రశాంతంగా ఉంది.
==> మన ప్రభుత్వంలో దీపావళి పండుగను ఎంత ఘనంగా జరుపుకుంటున్నామో.. రంజాన్ పండుగను కూడా అంతే బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఇఫ్లార్ పార్టీనీ ఇస్తున్నాం.
==> తెలంగాణలో గంగా జెమునా, తెహజీబ్ సంస్కృతి ఉంది. కేసీఆర్ బతికున్నన్నాళ్లూ తెలంగాణలో సెక్యులరిజం ఉంటది.

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

Also Read:  Vivo V29E 5G Price: అదిరిపోయే కెమెరా కలిగిన Vivo V29e 5G మొబైల్ ఇప్పుడు కేవలం రూ. 6,099కే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News