Telangana High Court: జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన.. 100 ఎకరాల్లో నిర్మాణం

New High Court Building In Rajendra Nagar: తెలంగాణ హైకోర్టు నూతన భవనం రాజేంద్రనగర్‌లో నిర్మాణం కానుంది. జనవరిలో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వంద ఎకరాల్లో హైకోర్టు భవనం నిర్మించనున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2023, 09:00 PM IST
Telangana High Court: జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన.. 100 ఎకరాల్లో నిర్మాణం

New High Court Building In Rajendra Nagar: సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టు భవనం నిర్మాణం శ్రీకారం చుట్టేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గరువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లోని MCR HRDలో సంబంధిత అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా.. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన అవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి.. ఈ మేరకు సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరిలో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.  

కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం హెరిటెజ్ బిల్డింగ్ అని.. దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. హైకోర్టు భవనాన్ని రినోవేషన్ చేసి.. సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, IAS అధికారి నవీన్ మిట్టల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read: Haj Yatra 2024: హజ్ యాత్రికులకు ముఖ్య గమనిక.. రిజిస్ట్రేషన్‌కు ఆ రోజే లాస్ట్

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News