Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు..

ప్రస్తుతం యువత మిడిల్‌ రేంజ్‌లో లభించే స్మార్ట్ ఫోన్స్‌ ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. ముఖ్యంగా సాధరణ బడ్జెట్‌లో లభించే మొబైల్స్‌ 25 నుంచి ౩5 శాతం వరకు ప్లాట్‌ తగ్గింపును అందిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2023, 11:40 AM IST
Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు..

Drop Vivo Y27 Price: ప్రస్తుతం యువత మిడిల్‌ రేంజ్‌లో లభించే స్మార్ట్ ఫోన్స్‌ ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. ముఖ్యంగా సాధరణ బడ్జెట్‌లో లభించే మొబైల్స్‌ 25 నుంచి ౩5 శాతం వరకు ప్లాట్‌ తగ్గింపును అందిస్తోంది. 

అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి vivo Y27 మొబైల్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభిస్తోంది. ఈ మొబైల్‌ అసలు ధర MRP రూ. 18,999 కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా 31 శాతం తగ్గింపుతో కేవలం రూ.12,999కే లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ అదనపు తగ్గింపు అందించేందుకు బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా మీరు ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఫైనల్‌గా కేవలం ఈ vivo Y27 స్మార్ట్‌ ఫోన్‌ రూ.12,499కే పొందవచ్చు. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ప్రస్తుతం ఈ vivo Y27 స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో మిస్టిక్ బ్లాక్, శాటిన్ పర్పుల్ రెండు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ Funtouch OS 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే..5000mAh పవర్‌ ఫుట్‌ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు 15W పవర్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది. ఇక డిస్ల్పే వివరాల్లోకి వెళితే..6.64 అంగుళాల LCD డిస్ల్పేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే డ్యూయల్ సిమ్ సపోర్ట్‌, 1 నానో సిమ్ + 1 నానో సిమ్, మైక్రో SD సెటప్‌ కలిగి ఉంటుంది.  

ఇతర ఫీచర్స్‌:
50 MP + 2 MP బ్యాక్‌ కెమెరా 
8 MP ఫ్రంట్‌ కెమెరా 
టైప్-సి యూఎస్‌బీ కెబుల్‌
జిపియస్ సపోర్ట్‌
2388 × 1080 రిజల్యూషన్‌ 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News