Complaint for Mutton Curry: మటన్ కర్రీ వండలేదని భార్యపై పోలీసులకు ఫిర్యాదు.. ఆ వెంటనే అరెస్టు!

Complaint for Mutton Curry: మద్యం తాగి వచ్చిన ఓ భర్త.. తన భార్య మటన్ కూర వండలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఫిర్యాదు చేసిన వ్యక్తినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీని వెనుక ఏం జరిగిందో తెలుసా?   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2022, 06:26 PM IST
Complaint for Mutton Curry: మటన్ కర్రీ వండలేదని భార్యపై పోలీసులకు ఫిర్యాదు.. ఆ వెంటనే అరెస్టు!

Complaint for Mutton Curry: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక దానిపై అప్పుడప్పుడు ఇరువురి మధ్య గొడవలు, కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సార్లు ఆ గొడవలు హత్యలకు దారి తీస్తుంటాయి. కానీ, తెలంగాణలో ఆ ఆసక్తికర సంఘటన జరిగింది. అది తెలిస్తే మీరు నవ్వుకోవడం సహా ఆశ్చర్యపోవడం ఖాయం. తన భార్య మటన్ కర్రీ వండలేదని నవీన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్యవసర నంబరు 100కు ఏకంగా 6 సార్లు కాల్ చేసి.. పోలీసులను పరుగులు పెట్టించాడు. 

ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కనగల్ మండలం చెర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి తన ఫోన్ తో పోలీస్ కంట్రోల్ రూమ్ 100 కి కాల్ చేసి తన భార్యపై ఫిర్యాదు చేశాడు. తీరా అతడి సమస్య ఏంటో తెలుసుకోగా.. తన భార్య మటన్ కర్రీ పెట్టలేదని కాల్ చేసి చెప్పాడు. కానీ, మొదట్లో నవీన్ చెప్పిన మాటలను పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మద్యం మత్తులో ఉన్న నవీన్ ఆరుసార్లు 100 కి కాల్ చేశాడు. అయితే అతడికి బుద్ధి చెప్పక తప్పదని పోలీసులు నిర్ణయించుకున్నారు.  

ఆ తర్వాత రోజున నవీన్ ఇంటికి చేరుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ నంబరు కాల్ చేసిన ఆందోళన చేసిన క్రమంలో నవీన్ పై భారతీయ శిక్షాస్మృతి ప్రకారం IPC 290, 510 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులను సమాయాన్ని వృథా చేసిన కారణంగా నవీన్ ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నవీన్ కు ఒకరోజు జైలు శిక్ష లేదంటే జరిమానా విధించ వచ్చని పోలీసులు స్పష్టం చేశారు.  

Also Read: Giant snake video: పెద్ద పాము తోక పట్టుకొని ఆడుకుంటున్న చిన్న పాప.. వీడియో వైరల్!

Also Read: Leopard Hunting Video: కసిగా వేటాడిన చిరుతపులి.. వెంటనే పట్టుబడిన మొసలి.. వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News