Giant snake video: పెద్ద పాము తోక పట్టుకొని ఆడుకుంటున్న చిన్న పాప.. వీడియో వైరల్!

Giant snake video: ఓ చిన్న పాప పెద్ద పాము తోక పట్టుకొని ఆడుకుంటుంది. సాధారణంగా పామును చూస్తే చాలా మంది భయపడతారు. కానీ, ఈ ఊహతెలియని చిన్నారి ఏకంగా ఆ పాము తోక పట్టుకొని ఆడుకోవడాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2022, 01:36 PM IST
Giant snake video: పెద్ద పాము తోక పట్టుకొని ఆడుకుంటున్న చిన్న పాప.. వీడియో వైరల్!

Giant snake video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం అనేక వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కానీ, అందులో అనేక భయంకరమైన వీడియోలతో పాటు హాస్యస్పద, ఆశ్చర్యకరమైన దృశ్యాలు కూడా నిత్యం ట్రెండ్ అవుతుంటాయి. మన కళ్లను మనం నమ్మలేని కొన్ని ఆశ్చర్యకర వీడియోలూ నిత్యం నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అలాంటి ఓ వీడియోలో ఓ చిన్న పాప పెద్ద పాముతో ఆడుకుంటోంది. 

పెద్ద పాము తోక పట్టుకొని..

సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. ఏడాది వయసున్న చిన్నారి, దాదాపు 15 అడుగులు పొడవున్న పాము తోకను పట్టుకొని లాగేందుకు ప్రయత్నిస్తుంది. పాము ముందుకు వెళ్లడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆ పాము తోకను పట్టుకొని చిన్నారి వెనక్కు లాగుతుంది. ఆ తర్వాత పామును ముందు నుంచి పట్టుకోవాలని చిన్నారి ప్రయత్నించగా.. తోకను మాత్రమే పట్టుకోవాలని అక్కడున్న వ్యక్తి సూచించాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world)

దాదాపు మూడు సార్లు ఈ చిన్నారి ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా పాము తోక పట్టుకొని వెనక్కి లాగింది. ఆ పాప ధైర్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ అయిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోకు బోలెడు లైక్స్ తో పాటు పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోలో ఏముందో మీరూ చూసేయండి.  

Also Read: Viral Video: కిచెన్​లో కొండచిలువ.. షాకింగ్ వైరల్ వీడియో!

Also Read: Shocking Video: మద్యం మత్తులో కత్తితో పొడుచుకున్న యువకుడు.. చికిత్స పొందుతూ మృతి- వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News