TS Fever Survey: తెలంగాణలో రేపటి నుంచి ఫీవర్ సర్వే: మంత్రి హరీశ్‌రావు

TS Fever Survey: తెలంగాణలో కరోనా కేసుల దృష్ట్యా ముందు జాగ్రత్తగా రేపటి నుంచి ఫీవర్‌ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 04:06 PM IST
  • తెలంగాణ పెరుగుతన్న కరోనా కేసులు
  • రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఫీవర్ సర్వే ప్రారంభం
  • వెల్లడించిన మంత్రి హరీశ్‌రావు
TS Fever Survey: తెలంగాణలో రేపటి నుంచి ఫీవర్ సర్వే: మంత్రి హరీశ్‌రావు

Telangana Fever Survey:  తెలంగాణలో రేపటి నుంచి ఫీవర్‌ సర్వే (Fever Survey in Telangana) నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు (Minister Harishrao) తెలిపారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కలెక్టర్ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 

పకడ్బందీగా సర్వే చేద్దాం..
ఫీవర్‌ సర్వేతో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్‌ కిట్లను (Medical Kits) పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. పకడ్బందీగా సర్వే చేపట్టి కొవిడ్‌ను కట్టడి చేద్దామని అధికారులకు సూచించారు. కరోనా సెకెండ్‌ వేవ్‌ సమయంలో ఫీవర్‌ సర్వే విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి చెప్పారు. వ్యాక్సినేషన్‌ (Vaccination) తీరుతెన్నులపై... కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వ్యాక్సినేషన్‌లోనూ వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి సారించాలని మంత్రి స్పష్టం చేశారు.

Also Read: Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌.. త్వరగా కోలుకోవాలని నేతల ఆకాంక్ష..

మంత్రి హారీశ్ రావు మాట్లాడుతూ... ''సీఎం కేసీఆర్‌ నెలరోజుల క్రితమే టెస్టింగ్‌, హోం ఐసోలేషన్‌ కిట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆయన సూచనల మేరకు 2కోట్ల టెస్టింగ్‌ కిట్లు, కోటి హోం ఐసోలేషన్‌ కిట్లు సిద్ధం చేశాం. ఆయా కిట్లను అన్ని జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు సహా గ్రామ స్థాయి వరకు పంపించాం. జిల్లా ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాం. రాష్ట్రంలోని 27వేల పడకలనూ ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చాం. 76 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు నిర్మించుకున్నాం''. అని చెప్పుకొచ్చారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News