Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌.. త్వరగా కోలుకోవాలని నేతల ఆకాంక్ష..

Kishan Reddy: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 03:31 PM IST
  • దేశంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌
  • త్వరగా కోలుకోవాలని నేతల ఆకాంక్ష
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌.. త్వరగా కోలుకోవాలని నేతల ఆకాంక్ష..

Central Minister Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కరోనా (Covid-19) బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.  ''ఈ రోజు నాకు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్నాయి. అన్ని ర‌కాల ప్రోటోకాల్స్‌ని ఫాలో అవుతున్నాను. ప్ర‌స్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవ‌లి కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోండి'' అంటూ కిషన్ రెడ్డి (Central Minister Kishan Reddy) ట్వీట్ చేశారు. 

కేంద్రమంత్రి చేసిన ఈ ట్వీట్‌కు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స్పందించారు. త్వ‌ర‌గా క‌రోనా నుంచి కోలుకోవాల‌ని అన్న అంటూ కామెంట్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ (Nitin Gadkari) కూడా కిష‌న్ రెడ్డి త్వ‌ర‌గా క‌రోనా నుంచి  కోలుకావాల‌ని కోరుతూ పోస్ట్ పెట్టారు. తెలంగాణలో  కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్​గా తేలింది. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణా రెడ్డి, శంకర్ నాయక్‌లకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వరుసగా అందరూ కరోనా బారిన పడుతుండటంతో.. నేతల్లో ఆందోళన మొదలైంది.

Also Read: Subhash Chandra Visits Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామి సేవలో రాజ్యసభ ఎంపీ, జీ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నిన్న 3,17,523 కేసులు (Corona Cases in india) నమోదయ్యాయి. వైరస్​తో మరో 491 మంది మరణించారు. 2,23,990 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతంగా ఉంది.  మరోవైపు,  దేశంలో ఒమిక్రాన్​ కేసులు (Omicron Cases in India) క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News