Hcu Thailand Student: హెచ్‌సీయూ అత్యాచారయత్న ఘటనలో ట్విస్ట్.. ఇంటికి తీసుకువెళ్లి మద్యం సేవించి..

Hyderabad Central University Case: హెచ్‌సీయూలో థాయిలాండ్ విద్యార్థినిపై అత్యాచార కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాత్రి వేళ బాధితురాలిని తన ఇంటికి తీసుకువెళ్లిన ప్రొఫెసర్.. మద్యం తాగించాడు. ఆ తరువాత..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2022, 01:25 PM IST
Hcu Thailand Student: హెచ్‌సీయూ అత్యాచారయత్న ఘటనలో ట్విస్ట్.. ఇంటికి తీసుకువెళ్లి మద్యం సేవించి..

Hyderabad Central University Case: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారాయత్నం ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. రాత్రి 8 గంటలకు క్యాంపస్ నుంచి బయటికి వచ్చిన బాధిత విద్యార్థిని.. హిందీ బేసిక్స్ నేర్పిస్తానంటూ తన కారులో తీసుకెళ్లారు ప్రొఫెసర్ రవి రంజన్. విద్యార్థిని తన ఇంటికి తీసుకువెళ్లి.. బాధిత యువతికి మద్యం తాగించాడు.అనంతరం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు  లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

తిరిగి బాధిత యువతని స్వయంగా కారులో తీసుకువచ్చి సెంట్రల్ యూనివర్సిటీ గేటు దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ వెళ్లిన బాధితురాలు.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ప్రొఫెసర్ రవి రంజన్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. గత నెల రోజుల క్రితం ఉమెన్ ఎంపవర్మెంట్‌పై రవి రంజన్  ఉపన్యాసం ఇచ్చి.. ఇప్పుడు యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
 
ఏం జరిగింది..?

థాయిలాండ్‌కి చెందిన విద్యార్థిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హిందీ డిపార్ట్మెంట్‌లో స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ చదువుతోంది. అదే డిపార్ట్మెంట్‌కు ప్రొఫెసర్ రవి రంజన్ హిందీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. ఆ విద్యార్థినిపై ఎప్పటి నుంచో కన్నేసిన ప్రొఫెసర్.. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. శుక్రవారం రాత్రి హిందీ బేసిక్స్ నేర్పిస్తానంటూ అత్యాచారానికి యత్నించాడు. పోలీసులు ప్రొఫెసర్ రవి రంజన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.

ఈ ఘటనపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నమోదైన కేసులపై చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడు ఈ ఘటన చోటుచేసుకుని ఉండేది కాదంటున్నారు. ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రొఫెసర్ రవిరంజన్‌ను హెచ్‌సీయూ సస్పెండ్ చేసింది.

Also Read: 7th Pay Commission: న్యూ ఇయర్‌కు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై క్లారిటీ

Also Read: Rajamouli Oscar Award : రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం.. నెట్టింట్లో వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News