Rajamouli Oscar Award : రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం.. నెట్టింట్లో వైరల్

Rajamouli Oscar Award రాజమౌళికి ఆస్కార్ ఆవార్డ్ రావడం పక్కా అని తెలుస్తోంది. ఎందుకంటే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ అని ఎవరిని అనౌన్స్ చేస్తే వారికే బెస్ట్ డైరెక్టర్ అవార్డు వస్తోందట.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2022, 10:21 AM IST
  • అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ సందడి
  • న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌ ట్వీట్ వైరల్
  • రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ పక్కానా?
Rajamouli Oscar Award : రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం.. నెట్టింట్లో వైరల్

New York Film Critics Circle Best Director Rajamouli : రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ఇంటర్నేషనల్ వైడ్‌గా ప్రమోట్ చేశాడు. దేశవిదేశాల్లో ఆర్ఆర్ఆర్‌ను తన స్టైల్లో ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. జపాన్‌లోనూ మన రాజమౌళి సత్తా చాటాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్ అవార్డ్ మీద కన్నేశాడు. ఆస్కార్ అవార్డు, ఇంటర్నేషనల్ ప్రమోషన్ కోసం యాభై కోట్లు ఖర్చు పెట్టేశాడంటూ రాజమౌళి మీద రకరకాల వార్తలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఎంత పాజిటివ్ ఇమేజ్ వచ్చిందో.. అంతే స్థాయిలో నెగెటివ్ కామెంట్లు కూడా వచ్చాయి.

రాజమౌళి మాత్రం తన సినిమాను వెస్ట్రన్ కంట్రీస్‌లో బాగానే ప్రమోట్ చేసుకున్నాడు. ఇండియా అఫీషియల్ ఎంట్రీ ఇప్పించకపోయినా.. ఆర్ఆర్ఆర్ తన స్టైల్లో ఎంట్రీ ఇప్పించేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో ఎవరు బెస్ట్ డైరెక్టర్ అని చెబితే.. వారికే బెస్ట్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు వస్తోందట. ఆ సంస్థ ఇప్పుడు బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి అని చెప్పుకొచ్చింది. దీంతో రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అంటూ ఆస్కార్ అవార్డు వస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు.

 

ఇదే ప్రశ్నను రామ్ చరణ్‌ను నిన్న జాతీయ మీడియా కూడా అడిగింది. మీకు ఆస్కార్ అవార్డ్ వస్తుందా? అని రామ్ చరణ్‌ని అడిగితే.. నాకు రాకపోయినా నేను పట్టించుకోను గానీ.. కచ్చితంగా రాజమౌళి గారికి రావాలి.. ఆయనే దానికి అర్హుడు అంటూ రామ్ చరణ్‌ తన మనసులోని మాటను చెప్పేశాడు.

మరి ఈసారి ఆస్కార్ అవార్డ్ వేడుకల్లో ఎలాంటి మిరికల్స్ జరుగుతాయో చూడాలి. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ వస్తుందా? అంతర్జాతీయస్థాయిలో ఈ మూవీ ఆకట్టుకుంటుందా? అవార్డులను గెలుస్తుందా? అన్నది దేశమంతా ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది.

Also Read : HIT 2 Main Villain : HIT 2 విలన్.. నెట్టింట్లో దారుణమైన ట్రోల్స్.. పరువుతీస్తోన్న నెటిజన్లు

Also Read : Suresh Babu-Samantha : సమంత మహానటి.. నాగ చైతన్య పెద్ద మామ సురేష్ బాబు కామెంట్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News