Gang Rape: పాఠశాలలో బాలికపై సామూహిక అత్యాచారం..!!

Gang Rape: హన్మకొండ జిల్లాలో అరాచకం వెలుగు చూసింది. బాలికపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది. కమలాపూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలోనే ఈ దురాగతం చోటు చేసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 07:25 PM IST
  • హన్మకొండ జిల్లాలో దారుణం
  • పాఠశాలలో బాలికపై సామూహిక అత్యాచారం
  • ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
Gang Rape: పాఠశాలలో బాలికపై సామూహిక అత్యాచారం..!!

Gang Rape: హన్మకొండ జిల్లాలో అరాచకం వెలుగు చూసింది. బాలికపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది. కమలాపూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలోనే ఈ దురాగతం చోటు చేసుకుంది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.కమలాపూర్‌ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరోజు, రెండు రోజులు కాదు.. పది రోజులుగా నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

తమకు అందిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులు కూడా మైనర్లే అని అంటున్నారు. అయితే, వారిలో నలుగురిని పోలీసులు వదిలేశారని ప్రచారం జరుగుతోంది.మరోవైపు.. బాలికను విచారించిన పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకోసం ఆసుపత్రికి తరలించారు. నిందితులకు కూడా వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read: Jagan on Ramya Vedict: రమ్య హత్య కేసులో తీర్పుపై జగన్ ట్వీట్

Also Read:Contractor Locked Village secretariat: సీఎం సొంత జిల్లాలో గ్రామ సచివాలయానికి తాళం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News