Government teacher suicide : 317 జీవో ప్రకారం బదిలీ.. ప్రభుత్వ ఉపాధ్యాయిని ఆత్మహత్య

Government teacher committed suicide in Nizamabad : నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయిని సరస్వతి ఆత్మహత్య. 317 జీవో ప్రకారం బదిలీ అయిన ఉపాధ్యాయిని.. దూర ప్రాంతానికి బదిలీ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 09:46 PM IST
  • నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండలం బాబాపూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయిని సరస్వతి ఆత్మహత్య
  • కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండాకు బదిలీ కావడంతో సూసైడ్
  • 317 జీవో ప్రకారం ఉపాధ్యాయిని సరస్వతి బదిలీ
Government teacher suicide : 317 జీవో ప్రకారం బదిలీ.. ప్రభుత్వ ఉపాధ్యాయిని ఆత్మహత్య

Government teacher committed suicide in Nizamabad District transferred as per 317 GO : నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండలం బాబాపూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయిని (Government teacher) బేతల సరస్వతి (36) ఆత్మహత్య చేసుకుంది. ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఆమె ఉరి వేసుకుని సూసైడ్ (suicide) చేసుకుంది. కొన్ని సంవత్సరాలుగా భీంగల్ మండలం రహత్‌నగర్‌లో (Rahatnagar) సరస్వతి (saraswati) ఉపాధ్యాయినిగా పని చేశారు.

అయితే ఉద్యోగుల కేటాయింపుల్లో భాగంగా ఉపాధ్యాయిని సరస్వతిని (Teacher Saraswati) కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండాకు ట్రాన్స్‌ఫర్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) జారీ చేసిన 317 జీవో (317 GO) నిబంధనల్లో భాగంగానే ఉపాధ్యాయిని సరస్వతి బదిలీ అయింది.

దూర ప్రాంతానికి బదిలీ కావడం వల్ల సరస్వతి మనస్తాపం చెంది ఆత్మహత్య (Suicide) చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read : Telangana Corona Update: తెలంగాణలో కరోనా విజృంభణ... కొత్తగా 1,673 మందికి పాజిటివ్!

మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. సరస్వతి భర్త బేతల భూమేష్ ఉపాధి నిమిత్తం ఖతార్‌లో ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయురాలు సరస్వతి ఆత్మహత్యపై (Suicide) స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో (Police Station‌) ఫిర్యాదు నమోదు అయింది. పోలీసులు (Police) ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read : Telangana: హనుమకొండ కేఎంసీలో కరోనా కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News