Family Suicide in Vijayawada: పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన మరవకముందే విజయవాడలో పప్పుల సురేష్ అనే వ్యక్తి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. విజయవాడలో కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన కుటుంబం మూకుమ్ముడిగా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబం:
తెలంగాణలోని నిజామాబాద్‌కి చెందిన పప్పుల సురేష్ కుటుంబం ఆర్థికంగా ఉన్నవారేనని స్థానికులు చెబుతున్నారు. పట్టణంలో వీరికి రెండు మెడికల్ షాపులు, ఒక పెట్రోల్ బంకు ఉన్నాయి. అయితే వ్యాపారంలో నష్టాలతో అప్పుల మీద అప్పులు చేయడం... సకాలంలో వాటిని తీర్చకపోవడంతో.. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.4 కోట్ల పైచిలుకు అప్పులు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇటీవల ఫైనాన్స్ సంస్థ సిబ్బంది సురేష్ ఉంటున్న ఫ్లాట్‌ను సీజ్ చేశారు. అప్పులు ఇచ్చినవారి ఒత్తిళ్లు, అవమాన భారంతో సురేష్ కుటుంబ సభ్యులు కుంగిపోయారు. ఈ నేపథ్యంలోనే సురేష్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.
సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో:
సురేష్ కుటుంబం రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. ఫైనాన్స్ సంస్థల వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో పేర్కొన్నారు. తమను వేధింపులకు గురిచేసినవారి వివరాలను వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియోను సురేష్ తమ బంధువులకు వాట్సాప్ ద్వారా పంపించినట్లు సమాచారం. నోట్‌తో పాటు ఆ సెల్ఫీ వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 3న విజయవాడకు:
పప్పుల సురేష్ కుటుంబం ఈ నెల 3న ఇంటి నుంచి విజయవాడకు బయలుదేరారు. స్థానిక శివాలయం సమీపంలో వాసవీ కన్యకా పరమేశ్వరి సత్రంలో గది అద్దెకు తీసుకున్నారు. 6వ తేదీన కనకదుర్గ దర్శనం చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీన సురేష్ ఇంటిని ఫైనాన్స్ సిబ్బంది సీజ్ చేశారు. ఆ మరుసటిరోజు సత్రంలోని గదిలో సురేష్ భార్య శ్రీలత, కుమారుడు ఆశిష్ విగతజీవులుగా (Nizamabad family suicide in Vijayawada) కనిపించారు. సురేష్‌తో పాటు మరో కుమారుడు అఖిల్ మృతదేహాలు కృష్ణా నదిలో లభ్యమయ్యాయి.
Also Read: OnePlus : యూజర్లను బెంబేలెత్తిస్తోన్న వన్ ప్లస్.. బాంబులా పేలిన మరో ఫోన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook