Heavy rains: మరో 4 రోజులు భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

Heavy rains in telangana: హైదరాబాద్‌: రానున్న నాలుగు రోజులు పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఈ నెల 12, 13 తేదీల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పిన వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో రెడ్​ అలర్ట్​ (Red alert) జారీచేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 11, 2021, 07:04 AM IST
Heavy rains: మరో 4 రోజులు భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

Heavy rains in telangana: హైదరాబాద్‌: రానున్న నాలుగు రోజులు పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఈ నెల 12, 13 తేదీల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పిన వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో రెడ్​ అలర్ట్​ (Red alert) జారీచేసింది. భారీ వర్షాల కారణంగా వరదలు తలెత్తే ప్రమాదం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిందిగా వాతావరణ శాఖ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ముందస్తు జాగ్రత్తగా పలు నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రభుత్వానికి సూచించారు. 

Monsoon arrival: రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమక్రమంగా రాష్ట్రం అంతటా విస్తరిస్తున్నాయి. దీనికి తోడు ఈ నెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటం వంటి వాతావరణ మార్పులే ఈ వర్షాలకు కారణంగా అధికారులు తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో పలు చోట్ల గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని దోమకొండలో బుధవారం అత్యధికంగా 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా కామారెడ్డిలోని బిక్నూరులో 12 సెం.మీ నమోదైంది. 

Also read : Dharani portal సమస్యలపై ఫిర్యాదు చేయాలా ? ఇదిగో whatsapp number

Highest rainfall recorded: అత్యధిక వర్షాపాతం నమోదైన జిల్లాలు
అలాగే కరీంనగర్‌‌‌‌లోని హుజూరాబాద్‌‌‌‌, వరంగల్​ అర్బన్‌‌‌‌ జిల్లాలోని హన్మకొండ, హసన్‌‌‌‌పర్తిలో 9 సెం.మీ, మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, నిజామాబాద్‌‌‌ జిల్లా‌లోని బోధన్‌‌‌‌లో 8 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.

Heavy rains - red alert issued: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు రెడ్ అలర్ట్
ఈ నెల 12న కరీంనగర్‌‌‌‌, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్​, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌‌‌‌ అర్బన్‌‌‌‌, వరంగల్‌‌‌‌ రూరల్‌‌‌‌, మహబూబాబాద్‌‌‌‌, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

Also read : Digital survey: తెలంగాణలో వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే లేటెస్ట్ అప్‌డేట్స్

ఈ నెల 13న జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌‌‌‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, కరీంనగర్‌‌‌‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం,  వరంగల్‌‌‌‌ అర్బన్‌‌‌‌, వరంగల్‌‌‌‌ రూరల్‌‌, మహబూబాబాద్‌‌‌‌, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురవనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also read : Rythu Bandhu scheme June 2021 installment: రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం.. సీఎం కేసీఆర్ ఆదేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News