Monsoon arrival: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

Rains in Telangana: హైదరాబాద్‌: కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే శనివారం తెలంగాణలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించేందుకు 24 గంటల సమయం పట్టవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2021, 03:52 AM IST
Monsoon arrival: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

Rains in Telangana: హైదరాబాద్‌: కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే శనివారం తెలంగాణలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించేందుకు 24 గంటల సమయం పట్టవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల రాకతో రాగల మూడ్రోజుల్లో తెలంగాణలో (Monsoon hits Telangana) అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

ప్రతీ ఏడాది జూన్ 1 నాటికి రుతు పవనాలు కేరళ ద్వారా దేశంలోకి ప్రవేశిస్తాయి. రుతుపవనాల రాక ద్వారానే వర్షాకాలం (Rainy season) మొదలైనట్లు పరిగణిస్తారు. కానీ ఈ ఏడాది రుతుపవనాలు మరో రెండు రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఈ ఏడాది శవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. 

మరోవైపు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు (Rain in Telangana) కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో మార్కెట్‌కి తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం నీళ్లపాలయిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Rains in Hyderabad) కురుస్తున్నాయి. నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది.

Trending News