Hemesh Chadalawada: హైదరాబాద్‌ యువకుడికి అరుదైన గుర్తింపు.. కేంద్ర మంత్రి చేతుల మీదుగా సత్కారం

Hemesh Chadalavada: ఆల్ఫామానిటర్‌ అనే రిస్ట్‌ బ్యాండ్‌ను రూపొందించిన హైదరాబాద్‌ నగరానికి చెందిన హేమేష్ చదలవాడను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సన్మానించారు. ఢిల్లీ ఇండియా హాబిటాట్ సెంటర్‌లో ఈ వేడుక జరిగింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2023, 11:55 AM IST
Hemesh Chadalawada: హైదరాబాద్‌ యువకుడికి అరుదైన గుర్తింపు.. కేంద్ర మంత్రి చేతుల మీదుగా సత్కారం

Hemesh Chadalavada: హైదరాబాద్‌ నగరానికి చెందిన హేమేష్ చదలవాడకు అరుదైన గౌరవం దక్కింది. ఆల్ఫామానిటర్ అనే రిస్ట్ బ్యాండ్ రూపొందించినందుకు గానూ.. న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా  సత్కారం అందుకున్నాడు. హేమేష్‌ చదలవాడతోపాటు ఇతర 20 మంది యువ సాధకులను కేంద్ర మంత్రి సత్కరించారు. ఢిల్లీ ఇండియా హాబిటాట్ సెంటర్‌లో  టైమ్స్ ఆఫ్ ఎ బెటర్ ఇండియా అన్‌స్టాపబుల్21లో భాగంగా ఈ సత్కార వేడుక ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. హ్యుమానిటీస్, సైన్స్, స్పోర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, సోషల్ యాక్టివిజం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రంగాలలో రాణించిన  20 మంది యువ సాధకులను సత్కరించారు.

హైదరాబాద్‌కు చెందిన హేమేష్.. 12 ఏళ్ల వయస్సులోనే ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ రంగంలో పరిశోధనలు మొదలు పెట్టాడు. అల్జీమర్స్ వ్యాధితో తన గ్రాండ్‌మదర్  పోరాటాన్ని చూసి సరికొత్తగా ఏదైనా కనిపెట్టాలని సంకల్పించుకున్నాడు. చిత్తవైకల్యంతో బాధపడుతున్న వృద్ధులకు సహాయం చేయడానికి 'ఆల్ఫామానిటర్' అనే స్మార్ట్ రిస్ట్‌బ్యాండ్‌ను రూపొందించేందుకు ప్రేరణ పొందాడు. తన అసాధారణమైన పనికి, అంకితభావానికి 2021లో హేమేష్  ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందుకున్నాడు. ప్రస్తుతం హేమేష్ వయస్సు 16 సంవత్సరాలు. 

అన్‌స్టాపబుల్21 అనేది కేవలం వేడుక కాదు.. ఇది మన దేశ యువతకు.. వారి టాలెంట్‌ను ప్రోత్సహించే అందించే వేదిక. దేశ యువత ప్రభావవంతమైన స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తోంది. హ్యూమన్ స్టడీస్, సైన్స్, క్రీడలు, ఫైన్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, సోషల్ ఇంపాక్ట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఏడు రంగాలలో విస్తరించి ఉన్న భారతదేశపు తిరుగులేని స్ఫూర్తిని కలిగి ఉన్న 21 ఏళ్లలోపు గల 21 మంది యువకులను అన్‌స్టాపబుల్21 గుర్తించింది. తెలంగాణ, చెన్నై, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 21 యువ సాధకులను గుర్తించింది.

అన్‌స్టాపబుల్21 జట్టును ఎంపిక చేసిన జ్యూరీలో చేతన్ భగత్, షాహీన్ మిస్త్రీ, విశ్వనాథన్ ఆనంద్, నందన్ నీలేకని, సంగీత జిందాల్, సుధా రఘునాథన్, అంకుర్ తివారీ, గోవింద్ రంగరాజన్, రోహన్ వర్మ వంటి ప్రముఖులు ఉన్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) డైరెక్టర్ గోవింద రంగర్జన్, ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారిణి సుధా రఘునాథన్, మ్యాప్‌మైఇండియా సీఈవో రోహన్ వర్మ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Also Read: Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

Also Read: ఖాకీ బట్టల్లో నందమూరి బాలకృష్ణ.. భగవంత్ కేసరి లో అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News