MHSRB Jobs Notification 2022: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

MHSRB Jobs Notification 2022: ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలనునే అభ్యర్థులు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్  mhsrb.telangana.gov.in లోకి లాగిన్ అవగలరు.

Written by - Pavan | Last Updated : Dec 6, 2022, 08:21 PM IST
  • మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ
  • ఈ నోటిఫికేషన్ ద్వారా 1147 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
  • దరఖాస్తు ప్రారంభ తేదీ, ఆఖరు తేదీ వివరాల కోసం పూర్తి వివరాలు ఇదిగో
MHSRB Jobs Notification 2022: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

MHSRB Jobs Notification 2022: తెలంగాణ వైద్యఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ కోసం వేచిచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వైద్యఆరోగ్య శాఖలో 1147 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టింట్ ఫ్రోఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 20వ తేదీ నుండి ఆన్‌లైన్లో దరఖాస్తులు సమర్పించేందు అవకాశం ఉంది. 

ఆశావహులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి జనవరి 5వ తేదీని ఆఖరు తేదిగా నిర్ణయించినట్టు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ప్రకటనలో పేర్కొంది. ఈ నోటిఫికేషన్ వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్విటర్ ద్వారా మీడియాతో పంచుకున్నారు. మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఏయే విభాగంలో ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారనే వివరాలను ఈ ప్రకటనలో పేర్కొన్నారు. 

 

అనస్థిషియా విభాగంలో అత్యధికంగా 155 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుండగా ఆ తరువాత ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగంలోనే అధికంగా 142 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రిక్రూట్ చేసుకోనున్నారు. ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలనునే అభ్యర్థులు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్  mhsrb.telangana.gov.in లోకి లాగిన్ అవగలరు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రెస్ మీట్ కాపీనీ  ట్విటర్ ద్వారా షేర్ చేసిన మంత్రి హరీష్ రావు.. భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read : MLC Kavitha: కవిత విజ్ఞప్తికి ఒప్పుకున్న సీబీఐ.. ఆరోజే విచారణ?

Also Read : Bandi Sanjay: ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ బానిస.. అయ్యకు తగ్గ బిడ్డగా కవిత.. బండి సంజయ్ కౌంటర్లు

Also Read : Hyderabad Prostitution Racket: హైదరాబాద్‌లో సంచలన కేసు.. ఇంటర్నేషనల్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏకంగా 1419 మంది అమ్మాయిలతో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News