Bandi Sanjay: ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ బానిస.. అయ్యకు తగ్గ బిడ్డగా కవిత.. బండి సంజయ్ కౌంటర్లు

Bandi Sanjay Vs Ktr: మంత్రి కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస అయ్యారని.. రక్తం, వెంట్రుక నమూనాలిస్తే నిరూపిస్తానంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. తాను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెబుతున్నారని.. తనకు ఆ అలవాటే లేదని స్పష్టంచేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన మాట్లాడారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2022, 05:13 PM IST
  • రక్త, వెంట్రుక నమూనాలిచ్చే దమ్ముందా..?
  • జీ20 నిర్వహణ సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోవడం సిగ్గు చేటు
  • ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay: ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ బానిస.. అయ్యకు తగ్గ బిడ్డగా కవిత.. బండి సంజయ్ కౌంటర్లు

Bandi Sanjay Vs Ktr: మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ వాడతారని.. రక్తం, వెంట్రుక నమూనాలిస్తే నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్ఫష్టం చేశారు. ‘‘నేను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెప్పినవ్ కదా.. నాకు ఆ అలవాటే లేదని నిరూపిస్తా. అందుకోసం రక్త నమూనాలతోసహా నా శరీరంలోని ఏ భాగమైన పరీక్షలకు ఇచ్చేస్తా.. మరి నీకు రక్తపు, రెండు వెంట్రుకల నమూనాలిచ్చే దమ్ముందా..?’’ అంటూ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ట్విట్టర్ టిల్లు బండారం బయటపడుతుందనే భయంతోనే బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను మూసివేయించారని అన్నారు. 

తక్షణమే ఆ కేసులు రీ ఓపెన్ చేసి విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలను బండి సంజయ్ కోరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ మంగళవారం నిర్మల్ జిల్లాలోని మామ్డ మండలం దిమ్మదుర్తి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ జయంతి సందర్భంగా కనీసం వారం రోజుల పాటైనా ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
అంబేద్కర్ వర్ధంతి, జయంతిలకు టీఆర్ఎస్ పార్టీ ఒక గంట సమయం కూడా కేటాయించదన్నారు. 

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత వారం రోజులపాటు బస్తీ బస్తీలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తాను ఎంపీ అయ్యానంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్షనేనని అన్నారు. మోదీ ప్రధాని అయ్యాకే పేదోళ్లకు ఈ దేశంలో న్యాయం జరుగుతోందన్నారు. అంబేద్కర్ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకే.. 'పంచ తీర్థాల'పేరుతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. 

‘‘జీ20 దేశాల్లో భారతదేశానికి అధ్యక్షత వహించే అవకాశం రావడం మనందరికీ గర్వకారణమని బండి సంజయ్. జీ 20 సదస్సులో అందరి సూచనలను తీసుకునేందుకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పార్టీ అధ్యక్షులను మోదీ ఆహ్వానిస్తే.. కేసీఆర్ ఎందుకు గైర్హాజరయ్యారు..? జీ20 సన్నాహక సమావేశాని కంటే కేసీఆర్‌కు ఇక్కడ ఇంకా పనేముంది..? అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే కేసీఆర్ మారుస్తానంటున్నాడు.. కేసీఆర్ అంతా పోటుగాడా.. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తేవాలని చూస్తున్నాడు.

దొంగ సారా దందా చేసిన బిడ్డను కాపాడుకునేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు. దళిత బంధు, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మాత్రం పైసలు లేవు.. దండుకోడానికి మాత్రం పైసలు ఉన్నాయి. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల దిబ్బగా మార్చారు. కేసీఆర్ బిడ్డ సారా దందా చేస్తే.. తెలంగాణ ప్రజలు ఉద్యమం చేయాలా..? లిక్కర్ దందా చేస్తే.. దర్యాప్తు సంస్థలు గుంజుకు పోవా..? అక్రమంగా సంపాదించిన సొమ్ముతో.. ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుంది. అవినీతిలో అయ్యకు తగ్గ బిడ్డగా కవిత గుర్తింపు పొందింది. ట్విట్టర్ టిల్లుకు తంబాకుకు, లవంగానికి కూడా తేడా తెలీదు. డాక్టర్ దగ్గరికి వెళ్లి కేటీఆర్‌వి రెండు వెంట్రుకలు ఇస్తే చాలు. డ్రగ్స్ తీసుకున్నాడో లేదో తెలుస్తుంది..’’ అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని.. పేదల రాజ్యం వస్తేనే ప్రజా సమస్యలు తీరుతాయన్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

Also Read: Hyderabad Prostitution Racket: హైదరాబాద్‌లో సంచలన కేసు.. ఇంటర్నేషనల్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏకంగా 1419 మంది అమ్మాయిలతో..

Also Read: Lalu Prasad Yadav: తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ దానం చేసిన కూతురు.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News