Harish Rao : గుజరాత్ లో బ్రిడ్జి కూలింది.. మోడీ సర్కార్ పతనానికి సిగ్నల్ పడింది!

Harish Rao Target BJP: చండూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు స్ట్రాంక్ కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి సభతో మునుగొడులో టీఆరెస్ గెలుపు ఖాయం అయిందన్నారు.  బీజేపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు

Written by - Srisailam | Last Updated : Oct 31, 2022, 02:14 PM IST
  • బీజేపీ ఆరోపణలకు హరీష్ రావు కౌంటర్
  • ఓట్ల కోసం బీజేపీ దివాలాకోరు రాజకీయాలు- హరీష్
  • అక్రమ డబ్బుతో ఎమ్మెల్యేలను లిఫ్ట్ చేసే ప్రయత్నం- హరీష్
Harish Rao : గుజరాత్ లో బ్రిడ్జి కూలింది..  మోడీ సర్కార్ పతనానికి సిగ్నల్ పడింది!

Harish Rao Target BJP: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరడంతో నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్జేజీకి చేరింది. చండూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు స్ట్రాంక్ కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి సభతో మునుగొడులో టీఆరెస్ గెలుపు ఖాయం అయిందన్నారు.  బీజేపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు. బీజేపీ నాయకులంతా నకిలీ, మకిలీ మాటలు మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. గల్లీలో ఉండే నాయకుల లెక్క కేంద్ర మంత్రులు, సంజయ్ మాటలు ఉన్నాయన్నారు. తెలంగాణ బీజేపీ నేతల స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారంటూ ఎద్దేవా చేశారు హరీష్ రావు.  కిషన్ రెడ్డి, సంజయ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓట్ల కోసం బీజేపీ దివాలాకోరు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

బీజేపీ లెక్క టీఆరెస్ దొడ్డిదారిన ప్రభుత్వాలను కూల్చలేదన్నారు హరీష్ రావు.  టీడీపీ రాజ్యసభ సభ్యులను విలీనం చేసుకున్నది రైట్ అయినప్పుడు..  తాము కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విలీనం చేసుకుంటే తప్పు అవుతుందా? అని ప్రశ్నించారు. 8 రాష్ట్రాల ప్రభుత్వాలను దొడ్డిదారిన కూల్చిన పార్టీ బీజేపీ కాదా? అని నిలదీశారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెలంగాణకు లేఖలు రాసిందంటూ అందుకు సంబంధించిన లేఖను విడుదల చేశారు హరీష్ రావు.పాయింట్- 5 FRBM నిధులు ఇవ్వాలంటే మోటార్లకు మీటర్లు పెట్టాలని షరతు పెట్టారని చెప్పారు. మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు పెట్టె కుట్ర బీజేపీ చేస్తోందన్నారు హరీష్ రావు. మీటర్లు పెట్టె అవసరం లేకపోతే 30వేల కోట్లు కిషన్ రెడ్డి తేవాలన్నారు. తెలంగాణ రైతుల కోసం 30వేల కోట్లు కేసీఆర్ వదులుకున్నారని తెలిపారు.

చేనేత వస్త్రాలపై GST ని మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆనాడే కోరిందని చెప్పారు హరీష్ రావు. ఆ సమయంలో మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నారని.. ఆయన్ను అడిగితే చెప్తారని చెప్పారు. తాను మంత్రి అయ్యాక కూడా 5 నుంచి 12శాతానికి పెంచాలని ప్రతిపాదనను కూడా టీఎస్ ప్రభుత్వం వ్యతిరేకించిందని చెప్పారు. కిషన్ రెడ్డి, సంజయ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రతిపైసా ఇప్పించాల్సిన భాద్యత కిషన్ రెడ్డిపై ఉందన్నారు. సినిమా డైలాగ్స్ కొట్టేందుకు బీజేపీ నాయకులు మీడియా సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ సభ చూసిన తరువాత బీజేపీ నేతలకుదిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందన్నారు.

గుజరాత్ బ్రీడ్జ్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి చెప్పారు హరీష్ రావు. గతంలో పశ్చిమ బెంగాల్ లో వంతెన కూలిపోతే...ఆ ప్రభుత్వాన్ని పడగొట్టమని దేవుడు సిగ్నల్ ఇచ్చిండని ప్రధాని మోడీ అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు గుజరాత్ లో బ్రిడ్జ్ పడిపోయింది కాబట్టి మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని సిగ్నల్ ఇచ్చిండని తాము అనాలా? అంటూ హాట్ కామెంట్స్ చేశారు హరీష్ రావు. తాము ప్రజల డబ్బులతో నీళ్లు లిఫ్ట్ చేస్తుంటే.. బీజేపీ మాత్రం అక్రమ డబ్బుతో ఎమ్మెల్యేలను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Morbi Bridge Collapse Updates: బీజేపీ ఎంపీ కుటుంబంలో తీవ్ర విషాదం.. కేబుల్ బ్రిడ్జ్‌ ప్రమాదంలో 12 మంది మృతి  

Also Read: Farm House Operation: ప్రగతి భవన్ బోనులోనే నలుగురు పులిబిడ్డలు.. దృశ్యం-3 సినిమా ఇంకా పూర్తి కాలేదా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News