Gujarat Cable Bridge Collapsed: గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇప్పటికే మృతులు సంఖ్య 141కి చేరినట్లు తెలుస్తుండగా.. ఇంకా అనేక మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో బీజేపీ ఎంపీ కుటుంబ సభ్యులు ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజ్‌కోట్ పార్లమెంట్ సభ్యులు మోహన్‌భాయ్ కల్యాణ్‌జీ కుందారియా సోదరి కుటుంబసభ్యులు తీగల వంతెన కూలిన ఘోర దుర్ఘటనలో మృతి చెందారు.
ఈ ఘటనపై ఎంపీ కుందారియా మాట్లాడుతూ.. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో తాను 12 మంది కుటుంబ సభ్యులను కోల్పోయానని తెలిపారు. వాళ్లంతా తన సోదరి కుటుంబానికి చెందిన వారని.. చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నాయని ఆయన బాధపడ్డారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. బాధితులను కాపాడేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నామని.. ఈ ఘటనకు గల కారణాలుపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ప్రమాదానికి బాధ్యులైన వారికి కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
గుజరాత్‌లోని మోర్బిలో 140 ఏళ్ల నాటి సస్పెన్షన్ బ్రిడ్జిని ఈ నెల 26వ తేదీనే అందుబాటులోకి తీసుకువచ్చారు. మచ్చు నదిపై మణిమందిర్ సమీపంలో బ్రిటీషర్ల కాలంలో ఈ వంతెనను నిర్మిచారు. ఆరు నెలల క్రితమే మరమ్మతుల కోసం మూసేసి.. తిరిగి ఐదు రోజుల క్రితమే పునఃప్రారంభించారు. బ్రిడ్జి ప్రారంభమైన ఐదు రోజుల్లోనే ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకోవడం పెను విషాదాన్ని నింపుతోంది. దీపావళి హాలీడేస్‌కు తోడు ఆదివారం కూడా కావడంతో కేబుల్ బ్రిడ్జ్ వద్ద సందర్శకుల సంఖ్య రద్దీ భారీగా పెరిగింది. ఒక్కసారిగా పర్యాటకులు ఎక్కువ కావడంతో అధిక బరువును మోయలేక బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలింది.
మరోవైపు కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై గుజరాత్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసింది. ఘటనపై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసింది. మునిసిపాలిటీస్ కమిషనర్ రాజ్ కుమార్ బెనివాల్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరగనుంది. సీఎం భూపేంద్ర పాటిల్, హోంశాఖ మంత్రి హర్ష సంఘవి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బ్రిజేష్ మేర్జా మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మోర్బిలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Also Read: Kohli's Room Video Leak: విరాట్ కోహ్లి హోటల్ రూమ్ వీడియో లీక్.. నెట్టింట వైరల్
Also Read: Ram Goapl Varma Vyuham: ఆర్జీవీ వ్యూహం సినిమాకు నా పాటలు ఇస్తా.. టీడీపీ నేత ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook