Mohan babu files petition in supreme court: మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. ఈ కేసులో మోహన్ బాబు దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తొంది. ఇప్పటికే హైకోర్టు ఆయనకు బెయిల్ ను నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఏ నిమిషమైన ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆయన అనూహ్యంగా సుప్రీంకోర్టును బెయిల్ ను మంజురు చేయాలని పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తొంది. దీనిపైన ప్రస్తుతం విచారణ ఉండనున్నట్లు తెలుస్తొంది. అయితే.. మోహన్ బాబు తనకొడుకు మంచు మనోజ్ లో మధ్య గొడవలు పీక్స్ కు చేరిన విషయం తెలిసిందే. జల్ పల్లిలో దగ్గర అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో మోహన్ బాబు ఇక రిపోర్టర్ పై లోగోతో దాడి చేశారు.
ఈ ఘటనపై మోహన్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసందే. దీన్ని అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా తీవ్రంగా ఖండించాయి. మోహన్ బాబు సైతం దిగొచ్చి సారీ కూడా చెప్పారు. మరోవైపు మోహన్ బాబుపై ఇప్పటి వరకు మూడు ఎఫ్ఐఆర్ లు నమోదైనట్లు తెలుస్తొంది.
మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు గత నెల 24 వరకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే . ఆ తర్వాత ఆయన హైకోర్టులో వేసుకున్న ముందస్తు బెయిల్ ను కోర్టు కోట్టివేసింది. ఈ క్రమంలో ఆయన తాజాగా, సుప్రీంకోర్టును ఆశ్రయించడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి