Keerthy suresh on baby john movie: నటి కీర్తిసురేష్ తాజాగా బేబీజాన్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో నటి బేబీజాన్ సినిమా అసలు ఎందుకు తీశానని ఎమోషనల్ అయినట్లు సమాచారం.
కీర్తిసురేష్ పెళ్లి తర్వాత ఏదో ఒక అంశంతో తరచుగా వార్తల్లో ఉంటున్నారు. ఆంటోనీ తట్టిల్ తో వీరి పెళ్లి గోవాలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. మహానటి ప్రమోషన్ లలో పాల్గొన్నారు.
పసుపుతాడు మంగళసూత్రం ధరించి ఆమె ప్రమోషన్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా.. నటి తాను అనుకున్నంతంగా బేబీ జాన్ మూవీ హిట్ కాలేదని బాధపడుతున్నారంట.
బేబీ జాన్ మూవీ.. తమిళంలో సామ్ నటించిన తేరీమూవీకి రిమేక్. అందులో సామ్ అదిరిపోయే విధంగా నటించారు. ఇక బేబీ జాన్ మూవీ సినిమాకు ముందు కీర్తిసురేష్ రఘు తాత అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
తాజాగా.. ఈ సినిమాకు సంబంధించి.. హిందిని నేర్చుకొవాలని ఒత్తిడి తెవడం తప్పని మెస్సెజ్ తోఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తొంది. నటి ఇటీవల ట్రైలర్ లో కూడా.. హిందీ తెలియదు పోవయ్యా అనే డైలాగ్ ఉన్నట్లు తెలుస్తొంది.
అయితే.. హిందీ భాషకు వ్యతిరేకంగా రూపొందించిన చిత్రంలో నటించి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చావని కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారంట. దీనిపై ప్రస్తుతం వివాదంగా మారిందని చెప్పుకొవచ్చు.
కీర్తిసురేష్ మాత్రం.. హిందీ భాషకు వ్యతిరేకంగా ఏ మూవీ రాలేదని.. కానీ భాషను కచ్చితంగా నేర్చుకోవాల్సిందే అనే తీరును వ్యతిరేకిస్తూ వచ్చిన సినిమాలో నటించానని కీర్తిసురేష్ క్లారిటీ ఇచ్చారంట. అయితే కూడా ప్రస్తుతం నెటిజన్లు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారంట.