allu arjun selfies controvery in nampally court: పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. డిసెంబరు 4 న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో.. రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో ఇంకా చికిత్స తీసుకుంటున్నాడు.ఈ ఘటనను సీఎం రేవంత్ సర్కారు సీరియస్ గా తీసుకుంది. మొత్తంగా 18మందిపై కేసుల్ని నమోదు చేసినట్లు తెలుస్తొంది.
నాంపల్లి కోర్టుకి చేరుకున్న అల్లు అర్జున్
జడ్జి సమక్షంలో పూచీకత్తుపై సంతకం చేయనున్న అల్లు అర్జున్ https://t.co/k28qY4OBgX pic.twitter.com/vDJ1rOvFX9
— Telugu Scribe (@TeluguScribe) January 4, 2025
దీనిలో అల్లు అర్జున్ ను చిక్కడ పల్లి పోలీసులు.. ఏ11గా చేర్చారు. అయితే... హైకోర్టు గతంలో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను ఇచ్చింది. తాజాగా.. నాంపల్లి కోర్టు లో రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నారు.ఈ గతంలో విచారణ జరిగిన నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ను జారీ చేసింది. అయితే.. ఈరోజు పూచీకత్తులు,మేజిస్ట్రేట్ ముందు పలు పత్రాలు సమర్పించేందుకు అల్లు అర్జున్ తన తరపు లాయర్ లతో కలిసి నాంపల్లికి కోర్టుకు హజరయ్యారు. ఆయన వెంట మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.
అయితే.. కోర్టుహల్ నుంచి అల్లు అర్జున్ బైటకు వచ్చేటప్పుడు... నాంపల్లి కోర్టు మెట్ల దగ్గర కొంత మంది అల్లు అర్జున్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. పోలీసులు వద్దని వారిస్తున్న కూడా.. ఆయనతో సెల్పీలు దిగారు. అక్కడున్న పోలీసులు వద్దని చెప్తున్న అభిమానులు వినలేదని తెలుస్తొంది.
అయితే.. ఇక్కడ అల్లు అర్జున్ కూడా.. అభిమానుల ఫోన్ లకు ఫోజులు ఇవ్వడం.. ఇక్కడ మళ్లీ వివాదాస్పదంగా మారిందని చెప్పుకొవచ్చు. గౌరవ కోర్టు వారి ఆవరణలో.. ఇలా ప్రవర్తించడంతో పట్ల అక్కడున్న పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది.
Read more: Rajiv Swagruha Flats: భారీ సెల్.. అమ్మకానికి రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు.. పూర్తి వివరాలు ఇవే..
ఈ వీడయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది. ఇంత జరిగిన అల్లు అర్జున్ కు మరల బుద్దిరాలేదా.. అంటూ కూడా కొంత మంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారంట. దీంతో అక్కడున్న అధికారులు మాత్రం.. దీనిపై సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook