Assembly: అసెంబ్లీలో అడుగడుగునా హక్కుల ఉల్లంఘన.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రోడ్డుపై ధర్నా

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సభా హక్కులను ఉల్లంఘనకు గురవుతుండడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. రోడ్డుపై కూర్చొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 14, 2024, 03:54 PM IST
Assembly: అసెంబ్లీలో అడుగడుగునా హక్కుల ఉల్లంఘన.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రోడ్డుపై ధర్నా

BRS Party MLAs Dharna in Assembly: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. రేవంత్‌ రెడ్డి, మంత్రులు పదే పదే ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్నారు. అడ్డగోలు ఆరోపణలు చేస్తుండడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. మీడియా పాయింట్‌లో మాట్లాడదామని వెళ్లగా ఊహించని పరిణామం ఎదురైంది. ఇక్కడ మాట్లాడవద్దని పోలీసులు అడ్డుకున్నారు. ఇదేం పద్ధతి అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విస్మయం వ్యక్తం చేశారు. కొద్దిసేపు వాగ్వాదం జరిగినా పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? అని నిలదీశారు. రూలింగ్ కానీ రాతపూర్వక ఆదేశాలు ఉన్నాయా అని డిమాండ్ చేశారు. స్పీకర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని.. మీకు అనుమతి లేదని భద్రతా సిబ్బంది స్పష్టం చేశారు.

Also Read: Chalo Nalgonda: నల్లగొండ సభలో గర్జించిన కేసీఆర్‌.. తెలంగాణ కోసం పులిలా కొట్లాడుతానని వ్యాఖ్యలు

సభా లోపల మాట్లాడనివ్వక.. బయటా మాట్లాడనివ్వకపోవడంపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్‌ అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోనే ప్రజాస్వామిక వాతావరణం లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిపక్షాలపై పోలీస్ ఆంక్షలు నిర్బంధం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పదేండ్ల పాలనలో ఇలాంటి నిర్బంధం ఉందా? అని గుర్తుచేశారు. మా హయాంలో కూడా మీరే పనిచేశారు కదా అని ప్రశ్నించారు. స్పీకర్‌ వద్దకు వెళ్లి మాట్లాడి వచ్చిన అధికారులు అనుమతించబోమని స్పష్టం చేయడంతో ఎమ్మెల్యేలు రోడ్డుపై ధర్నాకు దిగారు. 'జై తెలంగాణ.. జై కేసీఆర్.. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం' అని నినాదాలు చేశారు.

Also Read: Chalo Nalgonda: రెచ్చిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. కేటీఆర్‌, హరీశ్ రావు బస్సుపై కోడిగుడ్లతో దాడి

ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ధర్నా చేస్తూనే మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడారు. 'నేను కూడా శాసనసభ వ్యవహారాల మంత్ గా పనిచేశాను. అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడవద్దనే నిబంధన ఏదీ లేదు. ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది. సీఎం రేవంత్ ఎన్ని రోజులైనా మాట్లాడండి అవకాశం ఇస్తామన్నారు. మేము మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు' అని వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. 'సీఎం చెప్పేదొకటి చేసేదొకటి. అసెంబ్లీ ఆవరణ సభ్యుల హక్కు.. నియంత్రణ ఎలా పెడతారు. ఇలాంటి వాటిని తట్టుకుంటాం.. పోరాడతాం' అని స్పష్టం చేశారు.

అనంతరం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. 'సీనియర్ ఎమ్మెల్యే దళిత నాయకుడు కడియం శ్రీహరిపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలి. కడియం సీనియర్ ఎమ్మెల్యే.. ఆయన ఎక్కడా బడ్జెట్‌కు సంబంధం లేని విషయాలు మాట్లాడలేదు. సీఎం రేవంత్ ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దాన్ని తెలంగాణ భాషగా చెప్పుకుంటున్నాడు. తెలంగాణ భాషను సీఎం అవమానపరుస్తున్నారు' అని మండిపడ్డారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. 'రాజీవ్‌గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం?' అని నిలదీశారు. అక్కడ కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సూచించారు. అసెంబ్లీలో కంచెల పాలన తెచ్చారని, తమ గొంతు నొక్కుతున్నారని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

'అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన అనుచిత భాషను ఖండిస్తున్నాం' అని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్య అసెంబ్లీ రికార్డులకు వెళ్తుండడంతో వాటిని రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదని వివరించారు. 'సీఎం భాషకు ధీటుగా బదులు ఇవ్వగలం. కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉంది' అని తెలిపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాట్లాడతామంటే అవకాశం ఇవ్వరు.. బయట మీడియాతో మాట్లాడతామంటే అడ్డుకుంటున్నారని చెప్పారు. కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా? అని నిలదీశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News