TSPSC JOBS: గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వాళ్లందరికి ఉచితంగా కోచింగ్

TSPSC JOBS: ఉద్యోగ ఖాళీల భర్తీపై ఫోకస్ చేసిన తెలంగాణ సర్కార్ వరుసగా నోటిఫికేషన్లు ఇస్తోంది. తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.  టీఎస్ పీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. ఆగస్టు నుంచి హైదారాబాద్ బీసీ సర్కిల్ లో ఉచిత ఆన్ లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. 

Written by - Srisailam | Last Updated : Jul 20, 2022, 06:24 PM IST
  • గ్రూప్ వన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్
  • బీసీ స్టడి సర్కిల్ ఉచిత కోచింగ్
  • వెయ్యి మందికి ఆన్ లైన్ లో కోచింగ్
TSPSC JOBS: గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వాళ్లందరికి ఉచితంగా కోచింగ్

TSPSCC JOBS: ఉద్యోగ ఖాళీల భర్తీపై ఫోకస్ చేసిన తెలంగాణ సర్కార్ వరుసగా నోటిఫికేషన్లు ఇస్తోంది. తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.  టీఎస్ పీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. ఆగస్టు నుంచి హైదారాబాద్ బీసీ సర్కిల్ లో ఉచిత ఆన్ లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. మొత్తం వెయ్యి మందికి ఉచిత కోచింగ్ ఇవ్వాలని ప్లాన్ చేసింది. కుటుంబ వార్షిక ఆదాయం  ఐదు లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులు ఈ ఉచిత కోచింగ్ కు అర్హులు. tsbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ లో ఈనెల 22 నుంచి 29 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇటీవలే ఉద్యోగ భర్తీ, స్టడీ సర్కిళ్లపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో పోలీస్ రిక్రూట్ మెంట్ కోసం అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లుగానే .. గ్రూప్ వన్ అభ్యర్థులకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్టడీ సర్కిళ్లను ఇందుకు వినియోగించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో బీసీ స్టడీ సర్కిల్  ఆధ్వర్యంలో గ్రూప్ వన్ అభ్యర్థులకు ఆన్ లైన్ కోచింగ్ ఇవ్వబోతోంది. 

503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేసీఆర్ సర్కార్ ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసింది. భారీగా అప్లికేషన్లు వచ్చాయి. దీంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు ఊరటనిచ్చేలా  కీలక  నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అప్లయ్ చేసుకున్న సమయంలో ఏదైనా వివరాలను పొరపాటుగా నమోదు చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సరి చేసుకోవచ్చని సూచించింది. 

తాము గ్రూప్ 1 కు దరఖాస్తు చేస్తున్న క్రమంలో అనుకోకుండా కొన్ని తప్పులు వచ్చాయని కొందరు అభ్యర్థులు కమిషన్ కు ఫోన్స్ చేశారు. మరికొందరు మెయిల్స్ చేశారు. యడం లాంటివి చేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయా అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకున్న కమీషన్ దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని ఇటీవల ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఈ రోజు నుంచి తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశాన్ని ఇచ్చింది. 

Read also : Kaleshwaram Pumps:నీటిలో మునిగిన కాళేశ్వరం పంపు రిపేర్లకు ఎంత ఖర్చో! సీనియర్ ఐఏఎస్ సంచలనం..   

Read also : మెట్రో స్టేషన్‌లో అందమైన యువతి డ్యాన్స్‌.. నిమిషాల్లో వైరల్ అయిన వీడియో!  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News