CM KCR PRESS MEET: ఫాంహౌజ్ ఆపరేషన్ ఎపిసోడ్ పై కేసీఆర్ ప్రెస్ మీట్! బీజేపీ పెద్దలు బుక్కవుతారా..?

CM KCR PRESS MEET: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన  ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన పోస్టు పెట్టారు. పెద్ద సార్ ప్రెస్‌మీట్ అంటూ ఫేస్‌ బుక్‌లో రేగా పోస్టు పెట్టడం సంచలనంగా మారింది.

Written by - Srisailam | Last Updated : Oct 28, 2022, 12:43 PM IST
  • ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గంటకో ట్విస్ట్
  • ఇవాళ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం
  • పెద్ద సార్ ప్రెస్ మీట్ అంటూ రేగా కాంతారావు పోస్ట్
CM KCR PRESS MEET: ఫాంహౌజ్ ఆపరేషన్ ఎపిసోడ్ పై  కేసీఆర్ ప్రెస్ మీట్! బీజేపీ పెద్దలు బుక్కవుతారా..?

CM KCR PRESS MEET:  నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితుల రిమాండ్‌ను ఏసీబీ కోర్ట్ తిరస్కరించింది. దీంతో పోలీసులు వారికి 41 సీఆర్‌పీసీ కింది నోటీసులు ఇచ్చి.. 24 గంటల్లోగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ మాత్రం పూజల కోసమే తాము ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాంహౌజ్‌‌కు వెళ్లామని చెప్పాడు. ఎమ్మెల్యేల కొనుగోలు అనేది అబద్దమని, రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలియదన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన  ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన పోస్టు పెట్టారు. పెద్ద సార్ ప్రెస్‌మీట్ అంటూ ఫేస్‌ బుక్‌లో రేగా పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో రేగా కాంతారావు ఒకరు. రేగా పోస్టుతో ఈ విషయంలో కేసీఆర్ శుక్రవారం మీడియా ముందుకు రానున్నారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించి జాతీయ స్థాయిలో బీజేపీని ఎండగట్టేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతారనే ప్రచారం సాగుతోంది. కేసీఆర్ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారని.. అక్కడే మీడియాతో మాట్లాడుతారనే టాక్ వస్తోంది. ఎమ్మెల్యే రేగా కాంతారావు తాజా పోస్టుతో కేసీఆర్.. ప్రెస్ మీట్ ఎక్కడ పెడతారు అన్నది ఆసక్తిగా మారింది.

రోహిత్ రెడ్డి ఫాంహౌజ్ జరిగిన తతంగం అంతా కెమెరాల్లో రికార్డ్ అయిందని తెలుస్తోంది. 84 కెమెరాల్లో రికార్డ్ చేశారని.. బేరసారాలకు సంబంధించి మొత్తం గంటన్నర వీడియో ఉందని అంటున్నారు. పోలీసులు సేకరించిన వీడియోలను కేసీఆర్ క్షణ్ణంగా పరిశీలించారని చెబుతున్నారు. కొనుగోళ్లకు సంబంధించిన ఎపిసోడ్ లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం సాయంత్రం నుంచి ప్రగతి భవన్ లో ఉన్నారు. ఫాంహౌజ్ లో ఏం జరిగిందన్న దానిపై నలుగురు ఎమ్మెల్యేలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది. పూర్తి సమాచారం సేకరించిన సీఎం కేసీఆర్.. కొనుగోళ్లకు సంబంధించి పక్కా ఆధారాలను ప్రెస్ మీట్ లో బయటపెట్టనున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో గురువారమే కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతారనే ప్రచారం సాగింది.ఉదయం నుంచి సాయంత్రం వరకు కాసేపట్లో ప్రెస్ మీట్ అంటూ వార్తలు వచ్చాయి. నలుగురు ఎమ్మెల్యేలు కూడా మీడియా ముందుకు వస్తారనే ప్రచారం సాగింది. కాని కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్ట లేదు. నలుగురు ఎమ్మెల్యేలు కూడా ప్రగతి భవన్ నుంచి బయటికి రాలేదు. దీంతో కేసీఆర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదన్నది చర్చగా మారింది. ఇవాళ కూడా కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందా లేదా అన్న దానిపై క్లారిటీ రావటం లేదు. 

Read Also: Bandi Sanjay: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్.. బండి సంజయ్ అరెస్ట్?

Read Also: ఆహా'లో నరేష్ - పవిత్ర భార్యాభర్తలుగా నటించిన మూవీ రిలీజ్.. ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News