Andaru Bagundali Andulo Nenundali: ఆహా'లో నరేష్ - పవిత్ర భార్యాభర్తలుగా నటించిన మూవీ రిలీజ్.. ఎలా ఉందంటే?

Andaru Bagundali Andulo Nenundali Review: అలీ హీరోగా మలయాళ వికృతి సినిమాకు రీమేక్ గా ''అందరూ బాగుండాలి అందులో నేనుండాలి'' ​సినిమా రూపొందింది, అది ఎలా ఉందో రివ్యూలో చూద్దాం 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 28, 2022, 10:41 AM IST
Andaru Bagundali Andulo Nenundali: ఆహా'లో నరేష్ - పవిత్ర భార్యాభర్తలుగా నటించిన మూవీ రిలీజ్.. ఎలా ఉందంటే?

Andaru Bagundali Andulo Nenundali Review: ఈ మధ్యకాలంలో ఇతర భాషలలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్న ట్రెండ్ బాగా ఎక్కువైంది. తెలుగులో ఆ సినిమాలు అందుబాటులో ఉన్నా సరే రీమేక్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఇప్పటికే మలయాళం నుంచి అనేక సినిమాలను తెలుగులో రీమేక్ చేశారు. ఇప్పుడు తాజాగా వికృతి అనే సూపర్ హిట్ సినిమాను కూడా తెలుగులో ''అందరూ బాగుండాలి అందులో నేనుండాలి'' అనే పేరుతో రీమేక్ చేశారు ప్రముఖ కమెడియన్ అలీ.

అలీ తన అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నరేష్ పవిత్ర, లోకేష్ భార్య భర్తలుగా అలీ, మౌర్యాని హీరో హీరోయిన్లుగా నటించారు. సింగర్ మనో, తనికెళ్ల భరణి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం

కథ ఏమిటంటే:
పుట్టు మూగ -చెవిటి వ్యక్తి అయిన శ్రీనివాసరావు(నరేష్) తన భార్య సునీత(పవిత్ర లోకేష్) కుమార్తె(ప్రణవి), ఒక కుమారుడితో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఒక సెంట్రల్ గర్వర్మెంట్ లైబ్రరీలో పని చేసే శ్రీనివాసరావు దివ్యాంగుడైనా ఎందులోనూ వెనక్కి తగ్గకుండా తన కుటుంబాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉండగా అప్పుడే దుబాయ్ నుంచి పెళ్లి చేసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చిన సమీర్ అలీ తీసిన ఒక ఫోటో కారణంగా శ్రీనివాసరావు కుటుంబం అంతా చిన్నాభిన్నమవుతుంది.

ఆ ఒక్క ఫోటో కారణంగా అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న వారి జీవితాలు అన్ని అస్తవ్యస్తమైపోతాయి. ఇంతకీ సమీర్ తీసిన ఫోటో ఏమిటి? శ్రీనివాసరావు కుటుంబం ఆ ఫోటో వల్ల ఎన్ని బాధలు పడింది? పెళ్లి కోసమే దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన సమీర్ పెళ్లి చేసుకున్నాడా? ఆ ఫోటో వల్ల శ్రీనివాసరావు సునీత జీవితంలో జరిగిన పరిణామాలు ఏమిటి అనేది? ఈ సినిమా కథ.

విశ్లేషణ:
సాధారణంగా సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేస్తున్నారంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ సినిమా విషయంలో కూడా దాదాపుగా అదే జరిగింది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన వికృతి అనే సినిమాని తెలుగులో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే పేరుతో రీమేక్ చేసి తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేర్పులు చేయడంలో దర్శకుడు కిరణ్ సఫలమయ్యారు. అలాగే ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇదేదో సినిమా అనిపించకుండా రోజు మనం చుట్టుపక్కల కనిపించే సన్నివేశాలనే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కొంత హాస్యాన్ని పండిస్తూనే ఎమోషన్స్ ని కూడా టచ్ చేస్తూ సినిమా ఆద్యంతం హృదయానికి హత్తుకునే విధంగానే సాగుతుంది.

నరేష్ పవిత్ర లోకేష్ భార్యాభర్తలుగా నటించగా వారి మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. ఇక నేటి ఆధునిక కాలంలో సెల్ఫీల పిచ్చితో అనేకమంది ప్రాణాలు కూడా కోల్పోయారు, అలాగే ఈ సెల్ఫీలు, ఫోటోల పిచ్చితో అవతలి వాళ్ళ జీవితాలను నాశనం చేశారు ఇదే విషయాన్ని ప్రధానాంశంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఒకపక్క ఫన్ జనరేట్ చేస్తూనే మరోపక్క ఎమోషనల్ సీన్స్ తో కూడా ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

నటీనటుల విషయానికి వస్తే
నటీనటుల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సిన పాత్రలు నరేష్, పవిత్ర. వీరిద్దరూ ఈ మధ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి భార్యాభర్తలుగా నటిస్తూ ఉండడం సినిమా మీద ఆసక్తి పెంచింది. ఇక ఈ సినిమాలో నరేష్, పవిత్ర నిజంగా నటించారు అనడం కంటే జీవించారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలీ నటన గురించి మనం వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా ఈజ్ తో తన పాత్రను అలి పోషించారు, ఇక నరేష్ స్నేహితుడి పాత్రలో సింగర్ మనో తనదైన శైలిలో నటించారు.

అలీ సరసన నటించిన మౌర్యాని కూడా తన పాత్ర చిన్నది అయిన పాత్ర పరిధి మీద నటించి ఆకట్టుకుంది. తనికెళ్ల భరణి కనిపించింది ఒక్క సీన్ లోనైనా ఆయన పాత్ర గుర్తుండే విధంగా ఉంటుంది. నరేష్ కుమార్తె పాత్రలో నటించిన ప్రణవి, మనో కుమార్తె పాత్రలో నటించిన లాస్య ఇద్దరు కూడా అద్భుతంగా నటించారు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే
ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ కూడా ఆకట్టుకునే విధంగా సాగాయి. చిన్న బడ్జెట్ సినిమా అయినా సరే ప్రతి పాత్రకు బాగా తెలిసిన నటీనటులను ఎంచుకోవడం సినిమాకు ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.  దర్శకుడు శ్రీపురం కిరణ్ మేకింగ్ విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. చిన్నచిన్న లోపాలు కనిపించినా సరే ఓవరాల్ గా సినిమా మాత్రం బాగా కుదిరిందని చెప్పాలి. రాకేష్ అందించిన సంగీతం భాస్కరభట్ల అందించిన సాహిత్యం బాగా వర్కౌట్ అయ్యాయి.

ఇక కొన్ని సీనులను ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించడంలో మురళీమోహన్ రెడ్డి తన కెమెరాతో మ్యాజిక్ చేశారు. ఇక అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ, కొణతాల మోహన్ కలిసి సినిమాని ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా కాంప్రమైజ్ లేకుండా నిర్మించి డీసెంట్ హిట్ కొట్టారు. ఇక సెల్వ కుమార్ ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. 

ఫైనల్ గా చెప్పాలంటే
ఈ వీకెండ్ లో ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘’అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’’ కామెడీతో పాటు ఎమోషన్స్ ని కూడా సమపాళ్లలో కలిపిన ఫుల్ మీల్స్ ఈ మూవీ.
Also Read: Pawan Kalyan mistake: అన్నను చూసి కూడా అర్ధం చేసుకోని పవన్.. మరో తప్పు చేసేందుకు రెడీ?

Also Read: Kalyan Ram Amigos: కళ్యాణ్ రామ్ కోసం అఖండ మ్యాజిక్.. మైత్రీ మేకర్స్ ప్లాన్ అదిరిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News