Terrorist links in nizamabad: కరాటే పేరుతో ఉగ్రవాద శిక్షణ..ముగ్గురు అరెస్టు

Terrorist links in nizamabad: నిజామాబాద్‌‌‌లో ఉగ్రవాదుల లింకులు  కలకలం రేపుతున్నాయి. తాజాగా పీఎఫ్‌ఐకు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో ఏ మూల ఏ ఉగ్రవాద ఘటన జరిగినా తెలంగాణతో సంబంధాలు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Written by - Attili | Edited by - Attili | Last Updated : Jul 6, 2022, 06:37 PM IST
  • నిజామాబాద్‌లో ఉగ్రవాద లింక్‌లు
  • కరాటే పేరుతో ఉగ్రవాద శిక్షణ
  • ముగ్గురు పీఎఫ్‌ఐ సభ్యుల అరెస్టు
Terrorist links in nizamabad: కరాటే పేరుతో ఉగ్రవాద శిక్షణ..ముగ్గురు అరెస్టు

Terrorist links in nizamabad: నిజామాబాద్‌‌‌లో ఉగ్రవాదుల లింకులు  కలకలం రేపుతున్నాయి. తాజాగా పీఎఫ్‌ఐకు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పీఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లాతో పాటు మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మోబిన్ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కీలక వ్యక్తి ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో జిల్లా ఉలిక్కిపడింది.

నిషేధిత సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా పాపులర్ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా పని చేస్తోంది. నిజామాబాద్ లోని ఆటోనగర్ లో ఓ ఇంట్లో  కరాటే శిక్షణ పేరిట ఉగ్ర శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. కరాటే, లీగల్ అవేర్ నెస్ ముసుగులో అతివాద మతోన్మాదులకు మత ఘర్షణలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలి, భౌతిక దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

బైంసా అల్లర్లతో సంబంధాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. కడపలో వీరు బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరో 23 మంది కోసం గాలిస్తున్నట్లు సీపీ నాగరాజు వెల్లడించారు.

Also read: High Blood Pressure: బీపీని నిర్లక్ష్యం చేస్తే కంటి చూపే పోతుంది జాగ్రత్త

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News