High Blood Pressure: అధిక రక్తపోటు అనేది చాలా సహజం. సాధారణమైన జబ్బే. కానీ హై బీపీ ప్రభావం మన కళ్లపై కూడా పడుతుందంటే నమ్ముతారా..అందుకే జాగ్రత్తగా ఉండకపోతే కళ్లకు ముప్పేనంటున్నారు వైద్య నిపుణులు..
అధిక రక్తపోటు అనేది ప్రస్తుతం సాధారణంగా మారినా..దీని ప్రభావం శరీరంలోని చాలా భాగాలపై పడుతుంటుంది. ముఖ్యంగా గుండె, కిడ్నీలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. అందుకే కిడ్నీ, హార్ట్ సంబంధిత సమస్యలున్నవాళ్లు ముందుగా బీపీ లేకుండా చూసుకోవాలి. అయితే హై బీపీ ప్రభావం కళ్లపై కూడా పడుతుందని తాజాగా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బీపీ పెరగడం వల్ల కంటికి సంబంధించిన చాలా సమస్యలు రావచ్చు. బీపీ వల్ల కళ్లలో ఏయే సమస్యలొస్తాయో చూద్దాం..
హైపర్ టెన్షన్ వల్ల కంటి వెలుగు తగ్గిపోతుంది. బీపీ పెరగడం వల్ల మెదడులోపలి నాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కంటి నరాల్లో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఈ ప్రెషర్ ఎంతగా ఉంటుందంటే..రెటీనా ఏ విధమైన దృశ్యాన్ని బంధించలేకపోతుంది. ఫలితంగా ఏం కన్పించదు. హై బీపీ ఎక్కువగా ఉన్నవాళ్లు..ఎప్పటికప్పుడు ఐ చెకప్ చేసుకోవడం మంచిది.
హైపర్‌టెన్సివ్ రెటినోపతి సమస్య
హైపర్ టెన్షన్ రెటినోపతి అనేది సాధారణంగా దీర్ఘకాలం నుంచి బీపీతో బాధపడుతున్న రోగుల్లో కన్పిస్తుంది. ఈ వ్యాధి కారణంగా రక్త ధమనులు దెబ్బతింటాయి. ఫలితంగా రెటీనాలో వాపు వస్తుంది. కళ్లలో రక్త చారలు పెరిగిపోతాయి. దీనివల్ల కంటి వెలుగు పాడవుతుంది.
కళ్లలో బ్లడ్ స్పాట్స్
కొంతమందికి కళ్లలో బ్లడ్ స్పాట్స్ కన్పిస్తుంటాయి. దీనికి కారణం కూడా హై బీపీ కావచ్చంటున్నారు వైద్యులు. ఎక్కువగా ఈ సమస్య వృద్ధుల్లో కన్పిస్తుంది. దీనిని సబ్ స్కండక్టివల్ హెమరేజ్‌గా కూడా పిలుస్తారు. రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువైనా లేదా హై బీపీ ఉన్నా ఈ లక్షణం కన్పిస్తుందంటున్నారు.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook