TS E Challan Discount 2023: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ట్రాఫిక్ చలాన్లపై మళ్లీ భారీ రాయితీ..!

Discount on TS E Challan: పెండింగ్ చలానాలు వసూలు చేసేందుకు మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. గతేడాది వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో రూ.300 కోట్లు వసూలు అయ్యాయి. అలాంటి రాయితీ ప్రకటన త్వరలోనే రానుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 22, 2023, 06:23 AM IST
TS E Challan Discount 2023: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ట్రాఫిక్ చలాన్లపై మళ్లీ భారీ రాయితీ..!

Discount on TS E Challan: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతోంది. పెండింగ్‌లో ఉన్న చలాన్లను వసూలు చేసేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది పెండింగ్ చలాన్లపై రాయితీ ఇవ్వగా.. ఫైన్లు కట్టేందుకు వాహనదారులు ఎగబడ్డారు. రాయితీ ఉన్న సమయంలో దాదాపు రూ.300 కోట్ల వరకు పెండింగ్ చలాన్లు వసూలు అయ్యాయి. మరోసారి ఇలాంటి ఆఫర్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఉత్వర్తులు త్వరలోనే వెలువడే అవకాశం కనిపిస్తోంది.

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి తప్పు చేసినా.. ఫొటోలు క్లిక్‌మనిపించి ఆన్‌లైన్‌లో చలాన్లు పంపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. హైదరాబాద్ నగరంతోపాటు ఇతర చిన్న నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు కెమెరాలతో ఫొటోలు తీసి చలాన్లు విధిస్తున్నారు. ఇక ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నిబంధనలు ఉల్లంఘించినవారు ఈజీగా దొరికిపోతున్నారు. వీడియోల వాహనాలను ఆధారంగా గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు.

అయితే ఈ చలాన్లు వసూలు చేయడం ట్రాఫిక్ పోలీసులకు కష్టంగా మారుతోంది. ఎక్కడైనా చెకింగ్ నిర్వహించినప్పుడు వాహనం నంబరు ఆధారంగా చలాన్లు పెండింగ్‌లో ఉంటే అప్పుడు వసూలు చేస్తున్నారు. తనిఖీల సమయంలో మాత్రమే పెండింగ్ చలాన్లు ఎక్కువగా వసూలు అవుతున్నాయి. చాలామంది వాహనదారులు ఆన్‌లైన్‌లో తమ పెండింగ్ చలాన్లు చూసుకున్నా.. దొరికినప్పుడు కట్టుకుందాంలే అనుకుంటూ లైట్ తీసుకుంటున్నారు. ఇలా ఒక్కొ వాహనంపై పదుల సంఖ్యలో చలాన్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో భారీ రాయితీ ప్రకటిస్తే.. పెండింగ్ చలాన్లు వసూలు అవుతాయని పోలీసులు భావిస్తున్నారు. గతేడాది మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉండగా.. వీటిని వసూలు చేసేందుకు భారీ రాయితీ ప్రకటించారు. బైక్‌లపై 75 శాతం, మిగిలిన వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. దీంతో వాహనదారుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. పెండింగ్ చలానాలు చెల్లించేందుకు ఎగబడ్డారు. 45 రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.300 కోట్ల పెండింగ్ చలాన్లు వసూలు అయ్యాయి. అప్పుడు దాదాపు 65 శాతం చలానాలు చెల్లించగా.. ప్రస్తుతం మళ్లీ పెండింగ్ చలానాల భారం పెరుగుతోంది. దీంతో మరోసారి రాయితీ ప్రకటించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. 

Also Read: Salaar First Review: సలార్ ఫస్ట్ రివ్యూ... అవేవీ లేకపోయినా గూస్ బంప్స్ గ్యారంటీ

Also Read: Salaar Twitter Review: సలార్ ట్విట్టర్ రివ్యూ.. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ అదిరిపోయింది.. ఆ ఒక్కటి మాత్రం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News