Salaar First Review: సలార్ ఫస్ట్ రివ్యూ... అవేవీ లేకపోయినా గూస్ బంప్స్ గ్యారంటీ

Salaar Twitter Review: సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రభాస్ సలార్ మరికొద్ది గంటల్లో మన ముందుకి రానుంది. కాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ అప్పుడే వచ్చేసి సోషల్ మీడియాలో లో తెగ వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2023, 07:14 AM IST
Salaar First Review: సలార్ ఫస్ట్ రివ్యూ... అవేవీ లేకపోయినా గూస్ బంప్స్ గ్యారంటీ

 Salaar Review and Rating: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సలార్. అమెరికాలో అప్పుడే ఈ సినిమా మొదటి షోలు పడిపోయాయి. మొదటి నుంచి ఈ సినిమాకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏకంగా ఫ్రీ బుకింగ్ అప్పుడు.. బుక్ మై షో.. పేటీఎం యాప్ లు.. కూడా క్రాస్ అయిపోయాయి. ఇక హైదరాబాద్ లో కొన్ని థియేటర్స్ లో ఆఫ్‌ లైన్ టికెట్ కొనుగోలు పెట్టగా అక్కడ పోలీసులు వచ్చి అక్కడివారిని అదుపు చేయడానికి కుమ్మే వరకు పరిస్థితి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు అందరిలో ఆసక్తి నెలకొంది.

ప్రభాస్ కి బాహుబలి తర్వాత ఆశించిన విజయం రాకపోవడంతో ఈసారి ఎలా అయినా మన డార్లింగ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి వచ్చిన ఫస్ట్ రివ్యూ ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతుంది. కాగా ఈ ఫస్ట్ రివ్యూ ఇచ్చింది మరెవరో కాదు స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతున్న ‘గృహలక్ష్మి’ సీరియల్‌లో తులసి కూతురు దివ్య పాత్రలో నటించిన పూజిత రెడ్డి.

కాగా పూజిత రెడ్డి సలార్ గురించి ఇచ్చిన ఫస్ట్ రివ్యూ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అయితే పూజిత రెడ్డి సలాడ్ సినిమా రివ్యూ ఇవ్వడానికి ముఖ్య కారణం ఆమె కూడా సలార్ చిత్రంలో భాగం కావడం. కాగా పూజిత ప్రభాస్ ఫ్యాన్స్‌కి పూనకాలు రప్పించే గుడ్ న్యూస్ చెప్పింది. సలార్‌ లో భాగమైన పూజిత రెడ్డి ఆల్రెడీ ఆ సినిమా చూసేయడంతో ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ.. ‘సలార్’ ఫస్ట్ రివ్యూని చెప్పేసింది. ‘ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం గొప్పగా ఏం చేశాం అని అనుకుంటారు కదా.. నాకు ఈ ఏడాదిలో ది బెస్ట్ మూమెంట్ అంటే ‘సలార్’ సినిమా. చాలా రోజుల తరువాత జనాలు టికెట్ల కోసం క్యూలో నిలబడటం.. సర్వర్‌లు క్లాష్ కావడం.. అవన్నీ చూస్తుంటే నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అంత పెద్ద సినిమాలో నేను చిన్న పార్ట్ అయినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సలాడ్ సినిమాలో నేను సురభి అనే క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమా చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చేశాయి. అబ్బబ్బా ప్రభాస్.. ఏ కటౌట్‌ రా బాబూ.. ఏమున్నాడ్రా బాబూ అని అనిపించింది. నాకే ఇలా అనిపించిందంటే.. ఇక ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్‌కి ఎలా ఉంటుందో అది మీ ఊహకే వదిలేస్తున్నా’ అని చెప్పుకొచ్చింది.

‘ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేవు.. ప్రమోషన్స్ లేవు.. అదీ ఇదీ అని అంటున్నారు కానీ.. 22న బాక్సాఫీస్‌లు బద్దలైపోతున్నాయి. ‘సలార్’ బ్లాక్ బస్టర్ కాబోతుంది.. రికార్డులన్నీ బద్దలు కాబోతున్నాయి. ఈ సినిమాకి ప్రశాంత్ సార్.. దగ్గరుండి నాతో డబ్బింగ్ చెప్పించారు. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఆయనతో కలిసి పనిచేయడం. సినిమా ఎలా ఉందో.. 22న థియేటర్స్‌కి వెళ్లి మీరే చూడండి.. ‘సలార్’ దద్దరిల్లిపోతుంది’ అంటూ ప్రభాస్ అభిమానుల అంచనాలను మరింత పెంచేసింది పూజిత రెడ్డి.

 

Also Read: Bhatti Vikramarka: అసెంబ్లీలో కరెంట్‌పై లొల్లి.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. లెక్కలు బయటపెట్టిన భట్టి..!   

Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Trending News