TS Inter Exam Dates 2024: ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. పరీక్షల తేదీలు ఇవే

Inter 1st 2nd Year Exam Time Table: తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమై.. మార్చి 19వ తేదీ వరకు జరగనున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టీకల్స్ నిర్వహించనున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2023, 06:10 PM IST
TS Inter Exam Dates 2024: ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. పరీక్షల తేదీలు ఇవే

Inter 1st 2nd Year Exam Time Table: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడులైంది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 19వ తేదీన ముగుస్తాయి. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టీకల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరగనున్నాయి. ఎన్విరాన్‌మెంటల్ పరీక్షను ఫిబ్రవరి 19న 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు కొత్తగా ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఉంటాయి. అంటే ఇక నుంచి ఇంగ్లీషు థియరీ 80 మార్కులకు, ప్రాక్టికల్స్ 20 మార్కులకు ఉంటుంది. 

షెడ్యూల్ ఇలా.. 

ప్రథమ సంవత్సర పరీక్షల తేదీలు

==> ఫిబ్రవరి 28- పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజి పేపర్‌-1)
==> మార్చి 1- పార్ట్‌ 1 (ఇంగ్లీష్ పేపర్‌-1)
==> మార్చి 4- పార్ట్‌ 3 (మ్యాథ్స్ పేపర్-1ఏ, బోటనీ పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1)
==> మార్చి 6- మ్యాథ్స్‌ పేపర్‌ 1బీ, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1
==> మార్చి 11- ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1
==> మార్చి 13- కెమెస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1.
==> మార్చి 15- పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-1 (ఫర్ బైపీసీ స్టూడెంట్స్‌)
==> మార్చి 18- మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, జియోగ్రఫీ పేపర్‌-1.

సెకండియర్‌ పరీక్షల తేదీలు ఇవే..

==> ఫిబ్రవరి 29- పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2)
==> మార్చి 2- పార్ట్‌ 1 (ఇంగ్లీష్‌ పేపర్‌-2)
==> మార్చి 5- పార్ట్‌ 3 (మ్యాథ్స్‌ పేపర్‌ 2ఏ, బోటనీ పేపర్‌ 2, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ 2)
==> మార్చి 7- మ్యాథ్స్ పేపర్‌ 2బి, జువాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్-2
==> మార్చి 12- ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2
==> మార్చి 14- కెమెస్ట్రీ పేపర్‌ -2, కామర్స్‌ పేపర్‌-2
==> మార్చి 16- పబ్లిక్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-2 (ఫర్‌ బైపీసీ స్టూడెంట్స్‌)
==> మార్చి 19- మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News