Kishan Reddy Comments on BRS: బీఆర్ఎస్-కాంగ్రెస్ దొందు దొందే.. ఆ 12 మంది కట్టకట్టుకుని జంప్ అయ్యారు: కిషన్ రెడ్డి

Kishan Reddy Comments in BJP Maha Jan Sampark Abhiyan: గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు కట్టకట్టుకుని బీఆర్ఎస్‌లో చేరారని.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు కిషన్ రెడ్డి. అంబర్‌​పేట్​ నియోజకవర్గంలో మహాజన్​ సంపర్క్​ అభియాన్​ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 24, 2023, 12:02 PM IST
Kishan Reddy Comments on BRS: బీఆర్ఎస్-కాంగ్రెస్ దొందు దొందే.. ఆ 12 మంది కట్టకట్టుకుని జంప్ అయ్యారు: కిషన్ రెడ్డి

Kishan Readdy Comments at BJP Maha Jan Sampark Abhiyan: కాంగ్రెస్‌కు బీఆర్​ఎస్‌కు తేడా లేదని.. రెండు పార్టీలు ఒక్కటేనని కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. గతంలో ప్రజలు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 12 మంది బీఆర్​ఎస్​ పార్టీలో చేరారని, ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్​ఎస్‌లో చేరారని గుర్తు చేశారు. బీఆర్​ఎస్‌కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుందన్నారు. గురువారం మహాజన్​ సంపర్క్​ అభియాన్​.. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఆయన అంబర్‌​పేట్​ నియోజకవర్గంలో పర్యటించారు.  

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలు, ఆత్మబలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ.. ఈ రోజు ఓ కుటుంబం పాలైందన్నారు. ఆ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకొని మళ్లీ ఏలాలనుకుంటున్నదన్నారు. మాటల గారడీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రావాలంటే.. రాష్ట్రం కోసం అమరులైన 1200 వీరుల ఆకాంక్షలు నెరవేరాలంటే.. బీర్​ఎస్​ కుటుంబ పార్టీని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. అవినీతి, నియంతృత్వ, అక్రమాలు చేసే పార్టీని, అధికారం దుర్వినియోగం చేసే పార్టీని ఓడించాలని కోరారు. 

"కాంగ్రెస్‌కు.. బీఆర్​ఎస్‌కు తేడా లేదు. గతంలో మనం చూశాం.. ప్రజలు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 12 మంది బీఆర్​ఎస్​ పార్టీలో చేరారు.. ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్​ఎస్‌​లోకి పోయారు. అందుకే బీఆర్​ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే నిలబడుతుంది. బీఆర్​ఎస్‌​తో బీజేపీ ఇప్పటి వరకు పెట్టుకోలేదు.. భవిష్యత్‌​లో పెట్టుకోదు. కానీ కాంగ్రెస్​ పార్టీ అనేక ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నది.. ఢిల్లీలో బీఆర్​ఎస్​ వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో కూడా బీఆర్​ఎస్​ వాళ్లు కాంగ్రెస్​ హయాంలో మంత్రులుగా చేశారు. రాష్ట్రంలో నిజమైన ప్రజాప్రభుత్వం రావాలంటే.. నిజమైన బీఆర్​ఎస్​ వ్యతిరేక ప్రభుత్వం రావాలంటే అది బీజేపీతోనే సాధ్యం.

Also Read: YS Sharmila: కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల..? జోరుగా ప్రచారం

వందల, వేల కోట్ల రూపాయాలు అక్రమంగా సంపాదించి.. ఆ డబ్బును ఓటర్లకు పంచి ఎన్నికల్లో  గెలవాలనే దుర్మార్గపు ఆలోచనతో ఇక్కడి అధికార పార్టీ, కేసీఆర్​ ఉన్నారు. డబ్బులతో ప్రజలను ఎక్కువసార్లు మభ్యపెట్టలేరు. గతంలో జరిగిన హుజూరాబాద్​, హైదరాబాద్​ కార్పొరేషన్​ ఎన్నికలు అందుకు సాక్ష్యం. నరేంద్ర మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 9 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించేందుకు, దేశవ్యాప్తంగా బీజేపీ బూత్​ కమిటీలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తున్నాయి.." అని తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశంలో సుస్థిరమైన, ప్రజలకు అభివృద్ధి చేసి.. దేశ గౌరవం పెంచే ప్రభుత్వం ఉందని చెప్పారు.

Also Read: Bandi Sanjay: సింగిల్‌గానే పోటీ చేస్తాం.. జనసేనతో పొత్తుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News