Bandi Sanjay on BJP Alliance with Janasena: సింగిల్‌గానే పోటీ చేస్తాం.. జనసేనతో పొత్తుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు!

Bandi Sanjay Key Comments on BJP Alliance with Janasena: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పొత్తుపై బండి సంజయ్ స్పందించారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో చేరే నాయకులు ఆలోచించుకోని చేరాలని సూచించారు. 

Written by - Ashok Krindinti | Last Updated : Jun 24, 2023, 11:51 AM IST
Bandi Sanjay on BJP Alliance with Janasena: సింగిల్‌గానే పోటీ చేస్తాం.. జనసేనతో పొత్తుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు!

Bandi Sanjay Sensational Comment On BJP - Janasena Alliance: కాంగ్రెస్ పార్టీని నడిపిస్తోందే కేసీఆర్ అని.. కాంగ్రెస్‌లో చేరితే బీఆర్ఎస్‌కు సహకరించినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు గెలిచినా.. వెళ్లి కలిసేది బీఆర్ఎస్‌లోకేనని.. కేసీఆర్‌ను ఓడించాలనే నాయకులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై స్పందించిన బండి సంజయ్.. తాము తెలంగాణలో సింగిల్‌గానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితులు తప్పించుకునే వీల్లేకుండా పకడ్బందీగా సీబీఐ, ఈడీ ఆధారాలు సేకరిస్తున్నాయని తెలిపారు. తొమ్మదేళ్లుగా అమరవీరుల కుటుంబాలను పట్టించుకోని కేసీఆర్.. ఈరోజు పిలిచి సన్మానించడం  పెద్ద జిమ్మిక్కు అని విమర్శించారు. మహా జనసంపర్క్ అభియాన్‌ కార్యక్రమంలో బండి సంజయ్ గురువారం కరీంనగర్‌లోని చైతన్యపురి, జ్యోతినగర్ కాలనీల్లో పర్యటించారు. 

ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం ద్వారా ఈ ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు బండి సంజయ్. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన సమాచారం మేరకు.. ఉదయం 11 గంటల సమయానికి దాదాపు 20 లక్షల కుటుంబాలను బీజేపీ శ్రేణులు కలిసినట్లు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మోదీ పాలనపై కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనే అంశంపై ఇప్పటికే కిషన్ రెడ్డి అన్ని వివరాలు వెల్లడించారని.. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్ని హామీలు ఇచ్చింది..? ఎన్ని నెరవేర్చింది..? ఎంత అభివృద్ధి చేశారో ‌వివరించాలని అన్నారు. 

Also Read: Adipurush Collections: ఆదిపురుష్‌ కలెక్షన్లకు మేకర్స్ తిప్పలు.. 3D టిక్కెట్ రేట్లు తగ్గింపు.. కానీ..!

బీజేపీ-బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై బండి సంజయ్ స్పందించారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎవరి మీద గెలిచిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాలేదన్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లలో కూడా ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతు అయ్యాయని.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నం బీజేపీ మాత్రమేనని ప్రజలు నమ్మి ఓట్లేస్తున్నారని అన్నారు. 

కేసీఆర్‌ను ఓడించాలనే నాయకులు ఎవరూ కాంగ్రెస్‌ చేరొద్దని కోరారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటేని.. కాంగ్రెస్‌తో కేసీఆర్ కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో పొత్తు పెట్టుకున్నారని.. ఈసారి కూడా కలిసే పోటీ చేస్తారని అన్నారు. ఇప్పటికే 30 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంచారని చెప్పారు. కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిచినా బీఆర్ఎస్‌లోకి వస్తారనే ధీమా కేసీఆర్‌కు ఉందన్నారు. మోదీ 9 ఏళ్ల పాలనపై కరపత్రాలు అందించడంతోపాటు వారి ఇంటి తలుపులు, గోడలపై స్టిక్కర్లు అంటించారు.

Also Read: YS Sharmila: కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల..? జోరుగా ప్రచారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News