TS Rajyasabha: తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎవరు, కేసీఆర్ మదిలో ఉన్న ఆలోచనేంటి

TS Rajyasabha: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..రాజ్యసభ సీట్ల భర్తీపై దృష్టి సారిస్తున్నారు. ఫామ్‌హౌస్ సాక్షిగా వివిధ సామాజిక వర్గాల సమీకరణాలపై విశ్లేషణ చేస్తున్నారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 15, 2022, 06:17 PM IST
  • తెలంగాణ మూడు రాజ్యసభ స్థానాల భర్తీకై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి
  • వివిధ రాజకీయ, సామాజిక సమీకరణాలపై చర్చ
  • బండ్ల ప్రకాశ్ స్థానంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు అవకాశం ?
TS Rajyasabha: తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎవరు, కేసీఆర్ మదిలో ఉన్న ఆలోచనేంటి

TS Rajyasabha: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..రాజ్యసభ సీట్ల భర్తీపై దృష్టి సారిస్తున్నారు. ఫామ్‌హౌస్ సాక్షిగా వివిధ సామాజిక వర్గాల సమీకరణాలపై విశ్లేషణ చేస్తున్నారు. 

తెలంగాణలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. సంఖ్యాబలం ప్రకారం ఈ మూడు సీట్లు టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి. ఈ క్రమంలో రాజ్యసభకు ఎవరిని పంపించాలనే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. పార్టీ తరపున అభ్యర్ధుల్ని ఖరారు చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా వివిధ సామాజిక వర్గాల సమీకరణాల్ని పరిగణలో తీసుకుంటున్నారు. 

తెలంగాణ రాజ్యసభ సీట్లకు ఆశావహులు చాలా మందే ఉన్నా..కేసీఆర్ మాత్రం సామాజిక సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని పరిశీలన చేస్తున్నారు. దళి, బీసీ, ఓసీ సామాజికవర్గాలకు మూడు రాజ్యసభ సీట్లు కేటాయించాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. బండ్ల ప్రకాశ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు మే 19 నామినేషన్లకు చివరి తేదీగా ఉంది. ఇక డి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానాల్ని భర్తీ చేసేందుకు మే 31 నామినేషన్లకు చివరితేదీగా ఉంది. మొత్తానికి వచ్చేవారం మూడు స్థానాల అభ్యర్ధిత్వాలు ఖరారు కానున్నాయి. మే 18 నాటికి పార్టీ అభ్యర్ధులు ఎవరనేది వెల్లడి కానుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

బండ్ల ప్రకాష్ స్థానంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు అవకాశం లభించవచ్చనే వార్తలు విన్పిస్తున్నాయి. రాజ్యసభలో పార్టీ గళాన్ని సమర్ధవంతంగా విన్పించే నాయకుడు అవసరముంది. ప్రకాష్ రాజ్‌కు హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఉన్న ప్రావీణ్యం, పలుకుబడి ఉపయోగపడవచ్చనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. ప్రకాష్ రాజ్ ఆలోచన ఎలా ఉందో ఇంకా తెలియదు గానీ..కేసీఆర్ అతడిని ఒప్పించనున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సమావేశానికి కేసీఆర్..ప్రకాష్ రాజ్‌ను వెంట తీసుకెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 

ఇక దళిత ఆశావహుల్లో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులు, మాజీ ఎంపీ మందా జగన్నాధం రేసులో ఉన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రైబల్ నేత కావాలని భావిస్తే మాత్రం..మాజీ ఎంపీ అజ్మీరా సీతారామ్ నాయక్‌కు అవకాశం లభిస్తుంది. 

ఇక ఓసీ ఆశావహుల్లో ఓ తెలుగు న్యూస్ పేపర్ ఛైర్మన్, ఎండీగా ఉన్న దివకొండ దామోదరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిల పేర్లు విన్పిస్తున్నాయి. దామోదర్ రావు గతంలో కూడా ప్రయత్నించినా..సామాజిక, రాజకీయ సమీకరణాలు సరిపోక అవకాశం దక్కించుకోలేకపోయారు. మరోవైపు వ్యాపారవేత్త సీఎల్ రాజమ్ బ్రాహ్మణకోటాలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానంలో అవకాశం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ పార్ధసారథి రెడ్డి కూడా రేసులో ఉన్నారు. 

అదే సమయంలో రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ ఛైర్మన్ బి వినోద్ కుమార్ సైతం రేసులో ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన సన్నిహితులు మాత్రం 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని చెబుతున్నారు. 

Also read: Jeevan Reddy Fire: బండి సంజయ్‌ బెస్ట్‌ కమెడియన్‌.. అమిత్‌ షా బెస్ట్‌ విలన్‌ అంటున్న జీవన్‌ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News