Man Attacked MCA Student: ప్రేమోన్మాది ఘాతుకం ..యువతి ఇంటికి వెళ్లి కత్తితో గొంతుకోసిన యువకుడు..!

Man Attacked MCA Student: ప్రేమోన్మాదుల దారుణాలు ఆగడంలేదు. ప్రేమ పేరుతో అమ్మాయిల ప్రాణాలు తీయడానికి వెనుకాడటం లేదు కొందరు ఉన్మాదులు. తాజాగా హన్మకొండలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఏకంగా యువతి ఇంట్లోకి వెళ్లి గొంతుకోశాడు.  ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2022, 02:21 PM IST
  • హన్మకొండలో ఓ ప్రేమోన్మాది ఘాతుకం
  • ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యవకుడు
  • యువతికి తీవ్రగాయలు, ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు
Man Attacked MCA Student: ప్రేమోన్మాది ఘాతుకం ..యువతి ఇంటికి వెళ్లి కత్తితో గొంతుకోసిన యువకుడు..!

Man Attacked MCA Student: ప్రేమోన్మాదుల దారుణాలు ఆగడంలేదు. ప్రేమ పేరుతో అమ్మాయిల ప్రాణాలు తీయడానికి వెనుకాడటం లేదు కొందరు ఉన్మాదులు. తాజాగా హన్మకొండలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఏకంగా యువతి ఇంట్లోకి వెళ్లి గొంతుకోశాడు.  ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది.

హన్మకొండకు చెందిన విద్యార్థిని అనూషను అజార్‌అనే ఉన్మాది కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. దీనికి ఆ అమ్మాయి నిరాకరిస్తూ వస్తోంది. దీంతో రెచ్చిపోయిన అజార్.. అనూష ఇంటికి వెళ్లి కత్తితో గొంతుకోశాడు. బెడ్ రూంలో రక్తపు మడుగులో పడిఉన్న ఆమెను కుటుంబసభ్యులు వెంటనే ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. అనూష పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

అనూష కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతోంది. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఎంజీఎం హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అటు ప్రేమోన్మాది అజార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ లో సూపర్ సేల్.. రూ.449లకే Redmi Note 10T స్మార్ట్ ఫోన్!

Also Read: AP 10th Class Exams 2022: పదో తరగతి విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపిస్తే చాలు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News