AP 10th Class Exams 2022: పదోతరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బంపరాఫర్ ఇచ్చింది. ఈనెల 27 నుంచి మే 9 వరకు టెన్త్ పరీక్షలు (10th Class Exams 2022) జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు హాల్ టిక్కెట్ చూపిస్తే చాలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు. పరీక్ష అయిపోయాక ఇంటికి కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఇది కేవలం పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
పదో తరగతి పరీక్షలు ఈనెల 27 నుంచి మే 9 వరకు జరగనుండగా.. ఈ సమయంలో ఉచిత ప్రయాణానికి (free travel) అనుమతించాలని ఈడీ (ఆపరేషన్స్) బ్రహ్మానందరెడ్డి గురువారం అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చారు. పాస్ లేకపోయినా హాల్‌టికెట్ ఉంటే ప్రయాణానికి అనుమతించాలని అందులో వారు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 6.22లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.
ఏయే సబ్జెక్టులు ఏయే రోజున జరగుబోతున్నాయంటే..
ఏప్రిల్ 27-తెలుగు
ఏప్రిల్ 28-సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 29-ఇంగ్లీష్
మే 2-గణితం
మే 4-సైన్స్ పేపర్-1
మే 5-సైన్స్ పేపర్-2
మే 6-సోషల్ ఎగ్జామ్
Also Read: Gang Rape: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం... యువతిని 30 గం. పాటు బంధించి గ్యాంగ్ రేప్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.