Supreme Court Of India: ఏపీ సర్కార్‌కు సుప్రీం కోర్ట్ షాక్..!

Supreme Court Of India: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అభ్యర్థనను అంగీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో నిష్పక్షపాతంగా ట్రయల్‌ సాగే అవకాశం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తేల్చేసింది.

  • Zee Media Bureau
  • Oct 20, 2022, 06:28 PM IST

Supreme Court Of India: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అభ్యర్థనను అంగీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో నిష్పక్షపాతంగా ట్రయల్‌ సాగే అవకాశం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తేల్చేసింది. సాక్షులకు రక్షణ కల్పించాల్సిన పరిస్థితికి ఈ కేసు చేరుకోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు స్పష్టం చేసింది. సాక్షులకు ముప్పు ఉందని కోర్టును సీబీఐ ఆశ్రయించడం, ముప్పుపై కమిషనర్‌ నివేదిక ఇవ్వడం, దాని ఆధారంగా వారికి భద్రత కల్పించడం... వంటి పరిణామాలే కేసు విచారణను బదిలీ చేయడానికి కారణమని వివరించింది.

Video ThumbnailPlay icon

Trending News