2017లో సైన్స్ రంగం: ఆసక్తికర విషయాలు

2017 సంవత్సరంలో సైన్స్ రంగం పలు ఆశ్చర్యకరమైన వార్తలను అందించడం విశేషం. ఎన్నో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ఈ సంవత్సరం శాస్త్ర పురోగతికి బాటలు వేశాయి.. అందులో పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం  

Last Updated : Dec 30, 2017, 06:26 PM IST
2017లో సైన్స్ రంగం: ఆసక్తికర విషయాలు

2017 సంవత్సరంలో సైన్స్ రంగం పలు ఆశ్చర్యకరమైన వార్తలను అందించడం విశేషం. ఎన్నో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ఈ సంవత్సరం శాస్త్ర పురోగతికి బాటలు వేశాయి..అందులో పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం

జనవరి
*వ్యోమగాములపై నాసా మానసిక పరీక్షలు: చంద్రుడిపైకి పంపించినట్లే.. అంగారకుడి పైకి కూడా వ్యోమగాములను పంపాలనే యోచనలో ఉన్న నాసా నలుగురు పురుషులు, ఇద్దరు 
మహిళలతో కూడిన ఆరుగురు సభ్యులతో ఓ ప్రయోగం చేసింది. హవాయిలోని నిర్మానుష్య ప్రాంతంలో ఏర్పాటుచేసిన మార్స్ హాబిటట్ డోమ్‌లో వీరిని బంధించింది. ఫ్రీజ్ చేసిన డ్రై, క్యాన్డ్ ఫుడ్ మాత్రమే తినాలని సూచించింది. అంగారక గ్రహంపైకి వెళ్లే వ్యోమగాములను మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచడం కోసం నాసా ఈ పరీక్షలు నిర్వహించింది

*నావిక్ - భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థకు ప్రధాని నరేంద్ర మోదీ 'నావిక్' అనే పేరు పెట్టారు 

ఫిబ్రవరి
*క్వాంటమ్ కంప్యూటర్ - యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్‌కు చెందిన పరిశోధకులు క్వాంటమ్ కంప్యూటర్ కనిపెట్టడానికి అవసరమైన తొలి ప్రాక్టికల్ బ్లూప్రింట్ కనిపెట్టారు
*శక్తిమంతమైన మలేరియా టీకా - సనారియా పీఎఫ్ ఎస్‌పీజెడ్ సీవ్యాక్ అనే పేరుతో అత్యంత శక్తిమంతమైన మలేరియా టీకాను జర్మనీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
*శత్రువుల అస్త్రాలను విధ్వంసం చేసే నిరోధక క్షిపణి 'పీడివి'ని భారత్ విజయవంతంగా పరీక్షించింది
*ఇస్రో, పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్ ద్వారా తొలిసారిగా 104 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశబెట్టింది
*అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆహార పదార్థాలను మోసుకెళ్లేందుకు, స్పేస్ ఎక్స్ వ్యోమనౌక ద్వారా ఫాల్కన్ రాకెట్ ప్రయోగించారు
*మానవుల మాట్లాడే భాష ఆవిర్భావానికి గల కారణాలను కనుగొనడానికి జంతువులపై పరిశోధనలు చేసిన లండన్ శాస్త్రవేత్తలు, దాదాపు 5000 ఓరాంగ్ ఉటాన్‌ల అరుపులను, అవి ముద్దులు  పెట్టుకొనేటప్పుడు వచ్చే శబ్దాలను రికార్డు చేశారు. 

మార్చి
*జికా వైరస్ అనేది ఒకటి ఉందని.. అది 35 జాతుల దోమల వల్ల వ్యాప్తి చెందుతుందని అమెరికాలోని జార్జియా యూనివర్సిటీ తెలిపింది
*స్టాప్ వాచ్ టైమర్ - నాసా శాస్త్రవేత్తలు ఒక్క క్షణంలో వంద కోట్ల సంఖ్యలను గణించే స్టాప్ వాచ్ టైమర్ కనిపెట్టారు. 
*ప్రాజెక్టు 75 ద్వారా ఆరు సబ్‌మెరైన్లకు నౌకా నిరోధక క్షిపణులు అమర్చబోతున్నట్లు ఇండియన్ డిఫెన్స్ డిపార్టుమెంటు ప్రకటించింది

ఏప్రిల్
*మాంచెస్టర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సముద్రనీటిని తాగునీరుగా మార్చగల 'గ్రాఫిన్ మాట్'ను రూపొందించారు. 
*కరువు పరిస్థితిలో సైతం మంచి దిగుబడి ఇవ్వగల వరి వంగడాలను పండించవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు తెలిపారు. 
*ప్రపంచ అంతర్జాల అట్లస్‌ను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు.
*ఒక్క సెకనులో అయిదు లక్షల కోట్ల ఛాయాచిత్రాలు తీసే కెమెరాను లండన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనిపెట్టారు. 
*బార్క్ శాస్త్రవేత్తలు జాపత్రి గుజ్జు న్యూరో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడేలా ఔషధాన్ని కనిపెట్టారు
*భూమి లాంటి గ్రహం ఒకటుందని చెప్పిన శాస్త్రవేత్తలు దానికి "ఎల్‌హెచ్‌ఎస్ 1140 బీ" అని నామకరణం చేశారు 

మే
*నీలం రంగును పోలే కొత్తరంగుకి 'ఇన్ మిన్ బ్లూ' అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. 
*ఇస్రో ప్రయోగించిన జీశాట్ 9 వలన ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంక కూడా లబ్ది పొందాయి. అవి కూడా ఉపగ్రహ సేవలను పొందాయి.18వ
*సార్క్ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ జీశాట్‌ను దక్షిణాసియా దేశాలకు కానుకగా అందించారు.
*కేవలం అయిదు నిముషాల్లోనే స్మార్ట్ ఫోన్ మొత్తం ఛార్జింగ్ చేసే ఫ్లాష్ బ్యాటరీని ఇజ్రాయెల్ సంస్థ కనిపెట్టింది

జూన్
*2018లో సూర్యుడికి సమీపంలోకి ఓ వ్యోమనౌకను పంపించాలని అమెరికా సంకల్పించింది. ఆ నౌకకు 'పార్కర్ సోలార్ ప్రోబ్' అని నామకరణం చేసింది
*సౌర విద్యుత్ ద్వారా పనిచేసే మానవ రహిత విమానాన్ని చైనా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దానికి 'రెయిన్ బో' అని పేరు పెట్టారు
*జూన్ 13న డీఆర్‌డీఓ ప్రయోగించిన నాగ్ క్షిపణి ట్యాంకర్లను విధ్వంసం చేయగల శక్తి కలిగి ఉంటుందని సమాచారం
*సౌర కుటుంబంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన గ్రహం గురుగ్రహమని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తేల్చారు.
*గత 137 సంవత్సరాలతో పోల్చుకుంటే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నెలగా మే 2017ను గుర్తించినట్లు నాసా తెలిపింది
*హ్యాకింగ్‌కు స్వస్తిపలికే వ్యవస్థను కనిపెట్టేందుకు.. అందుకోసం క్వాంటమ్ ఇంటర్నెట్‌ను సాకారం చేసే దిశగా చైనా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు
*ప్రపంచంలోనే అతి సూక్ష్మమైన యాంటీ వైరల్ కణాన్ని తమిళనాడు మహిళాశాస్త్రవేత్త టి. వసంతి కనుగొన్నారు

జులై
*కళ్లజోడు లేకుండా త్రీడీ సినిమాలు చూసే వ్యవస్థను అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టారు
*బ్రిటన్ శాస్త్రవేత్తలు మానవ యాంటీబాడీలను తొలిసారిగా లాబ్‌లో ఉత్పత్తి చేశారు

ఆగస్టు
*జికా వైరస్‌కు సంబంధించి టీకా కనిపెట్టడానికి.. మొక్కలపై పరిశోధన చేశారు అమెరికాలోని ఆరిజోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు
*అంగారక గ్రహంపై స్పైడర్స్‌గా వ్యవహరించే ప్రత్యేక భూ ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు

సెప్టెంబరు
*డ్రైవర్ రహిత ట్రాక్టరును దేశంలోనే తొలిసారిగా మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూప్ తయారుచేసింది
*ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే సరికొత్త పదార్ధాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ పదార్ధానికి 'పాలీసాచరైడ్ పాలీ ఎలక్ట్రోలైట్' అని పేరు పెట్టారు
*అంటార్కిటికాలో పంటలు పండించే ఉద్దేశంతో జర్మనీ పరిశోధకులు అక్కడ గ్రీన్ హూస్‌ను స్థాపించారు

అక్టోబరు
*ఆస్తమా పెరగకుండా విటమిన్ డి మాత్రలు కాపాడే అవకాశముందని లండన్ క్వీన్ మేరీ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు
*ప్రపంచంలోనే అత్యంత కాంతివంతమైన నక్షత్రాన్ని లీసెస్టర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గుర్తించారు. దానికి 'నోవా ఎస్ ఎంసీఎన్ 2016 - 10ఎ' అని పేరు పెట్టారు

నవంబరు
*పశువుల్లో వ్యాధులను తేలికగా గుర్తించేందుకు ఉపయోగించే అధునాతన కిట్‌ను పూణెకి చెందిన 'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ' సంస్థ, జైడస్ క్యాడిలా సంస్థతో కలిసి రూపొందించింది

డిసెంబరు
*న్యూజిలాండ్‌కి చెందిన శాస్త్రవేత్తలు 60 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే పెంగ్విన్లు భూమిపై ఉండేవని.. వాటి పరిమాణం, మానవ పరిమాణంతో సమానంగా ఉండేదని తెలిపారు. 

Trending News