ఒక్కరోజులోనే 242 మంది మృతి..

ఆసియాలో అగ్రరాజ్యం చైనా . . కరోనా వైరస్ దెబ్బకు గిజగిజలాడుతోంది. కోవిడ్-19 వ్యాధి. . చైనాను అతలాకుతలం చేస్తోంది.  చైనాలోని వుహాన్ లో ప్రారంభమైన వైరస్..  చైనా అంతటా మృత్యు ఘంటికలు మోగిస్తోంది.

Last Updated : Feb 13, 2020, 10:32 AM IST
ఒక్కరోజులోనే 242 మంది మృతి..

కొనసాగుతున్న కోవిడ్-19 మృత్యుఘోష 
కరోనా దెబ్బకు గజగజా వణుకుతున్న చైనా..
 

ఆసియాలో అగ్రరాజ్యం చైనా . . కరోనా వైరస్ దెబ్బకు గిజగిజలాడుతోంది. కోవిడ్-19 వ్యాధి. . చైనాను అతలాకుతలం చేస్తోంది.  చైనాలోని వుహాన్ లో ప్రారంభమైన వైరస్..  చైనా అంతటా మృత్యు ఘంటికలు మోగిస్తోంది.  ఇప్పటికే ఈ కరోనా వైరస్ దెబ్బకు 13 వందల 55 మంది మృత్యు ఒడిని చేరుకున్నారు. తాజాగా నిన్న ఒక్కరోజే చైనాలోని హుబే ప్రావిన్స్ లో  కరోనా వైరస్ కారణంగా రికార్డుస్థాయిలో మరణాలు సంభవించాయి. కేవలం నిన్న ఒక్కరోజే 242 మంది మృతి చెందారు. అంటే చైనాలో కోవిడ్-19 ప్రభావం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 10న రికార్డు స్థాయిలో 103 మంది మృతి చెందారు. ఐతే నిన్నటి మృతుల సంఖ్య దాని కంటే రెట్టింపు కావడం విశేషం.  

చైనాలో కరోనా వైరస్ బారిన దాదాపు 60 వేల మంది ఆస్పత్రుల్లో చేరారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చైనా వైద్యఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు హుబేప్రావిన్స్ లో కొత్తాగా 14 వేల 480 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అటు కరోనా వైరస్ ఇప్పటికే 27 దేశాలకు విస్తరించింది. తాజాగా సింగపూర్ లో 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐతే వారందరికీ ఉచితంగా వైద్యం అందిస్తామని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు జపాన్ యోకోహోమా పోర్టులోని ఓ భారీ షిప్పులో 175 మందికి కరోనా వైరస్ సోకింది. వారందరి రక్త నమూనాలను పరీక్షలకు పంపించగా .. పాజిటివ్ వచ్చిందని అక్కడి వైద్యులు తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News