ధనిక దేశాల్లో 6వ స్థానంలో భారత్.. అగ్రస్థానంలో అమెరికా

ఆఫ్రో ఆసియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ప్రకారం ప్రైవేటు ఆస్తుల పరంగా ఉన్నతి స్థితిలో ఉన్న ధనిక దేశాల జాబితాలో భారత్ 6వ స్థానంలో కొనసాగుతోంది.

Last Updated : May 20, 2018, 05:54 PM IST
ధనిక దేశాల్లో 6వ స్థానంలో భారత్.. అగ్రస్థానంలో అమెరికా

ఆఫ్రో ఆసియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ప్రకారం ప్రైవేటు ఆస్తుల పరంగా ఉన్నతి స్థితిలో ఉన్న ధనిక దేశాల జాబితాలో భారత్ 6వ స్థానంలో కొనసాగుతోంది. కాగా ఇదే జాబితాలో అమెరికా 62,584 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగడం విశేషం. అమెరికా తర్వాతి స్థానాల్లో చైనా (24,803 బిలియన్ డాలర్లు), జపాన్ (19,522 బిలియన్ డాలర్లు), యూకే (9,919 బిలియన్ డాలర్లు), జర్మనీ (9,660 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.

ఆ తర్వాత  8,230 బిలియన్ డాలర్లతో భారత్ 6వ స్థానంలో కొనసాగుతోంది. భారత్ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా,కెనెడా, ఫ్రాన్స్, ఇటలీ కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో భారతదేశంలో విదేశీ పెట్టుబడులు పెరగడం, స్టార్టప్స్ ఎదగడం, విద్యావ్యవస్థలో మార్పులు రావడం, ఐటి సంస్థలు, బీపీఓ రంగం, రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో ఈ జాబితాలో భారత్ ర్యాంకింగ్ మెరుగుపడింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 584,000 మల్టీ మిలియనీర్లు ఉన్నారు. అందులో ఒక్కొక్కరి వద్ద 10 మిలియన్ డాలర్లకు పైగానే ఆస్తులున్నాయి. అలాగే ప్రపంచంలో 2,252 మంది బిలియనీర్లు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరి వద్ద 1 బిలయన్ డాలర్లకు పైగానే ఆస్తులున్నాయి. 2027 సంవత్సరానికల్లా వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

వీరి ఆస్తుల ప్రభావం ఆయా దేశాల ఆర్థిక రంగంపై కూడా కచ్చితంగా పడుతుంది. నేడు శ్రీలంక, వియత్నాం, మారిషస్ లాంటి దేశాలు కూడా ధనిక దేశాలుగా చెలమాణీ అవ్వడానికి తమదైన శైలిలో విభిన్న రంగాల్లో రాణిస్తున్నాయి. 

Trending News