సుష్మా ఒక ఆకర్షణీయమైన విదేశాంగ మంత్రి : ఇవాంకా ట్రంప్

Last Updated : Sep 20, 2017, 10:28 AM IST
సుష్మా ఒక ఆకర్షణీయమైన విదేశాంగ మంత్రి : ఇవాంకా ట్రంప్

న్యూయార్క్‌‌లో తన పర్యటనలో భాగంగా అమెరికా ప్రధాని డొనాల్ఢ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను కలిసిన భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్, మహిళా వ్యవస్థాపకత, ఇరు దేశాల్లో శ్రామికాభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఆ క్రమంలో ఇవాంకా మాట్లాడుతూ సుష్మా స్వరాజ్‌ను ఆకర్షణీయమైన విదేశాంగ మంత్రిగా అభివర్ణించారు. 

అక్టోబరు నెల 28 నుండి 30 వ తేదీ వరకు హైదరాబాదులో జరగబోయే జీఈఎస్ (గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్) సదస్సుకు హాజరవ్వబోయే ఇవాంకా ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించబోయే నేపథ్యంలో ఈ కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది. న్యూయార్క్ పర్యటనలో భాగంగా ఆ నగరంలో పలు ప్రముఖులను కలుసుకున్న సుష్మా స్వరాజ్ ఈ నెల 23న జరగబోయే ఐరాస సర్వ ప్రతినిథుల సభ 72వ వార్షికోత్సవంలో ప్రసంగిస్తారు. 

Trending News