Libya Floods 2023: ప్రకృతి విలయ తాండవం..వరద ధాటికి వేలాది మంది దుర్మరణం

డేనియల్  తుఫాన్ కారణంగా ఉత్తర ఆఫ్రికాలోని లిబియా దేశాన్ని చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తాయి.  ఈ వరదల కారణంగా లిబియాలోని డెర్నా నగరంలో దాదాపుగా 25 శాతం తుడిచిపెట్టుకుపోకుపోగా..  సుమారు 20 వేల మంది చనిపోయి అంచనా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2023, 09:00 PM IST
Libya Floods 2023: ప్రకృతి విలయ తాండవం..వరద ధాటికి వేలాది మంది దుర్మరణం

Libya Floods 2023: ఆఫ్రికా ఖండం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఉత్తర ఆఫ్రికాలోని లిబియా దేశాన్ని ఇప్పుడు వరదలు ముంచెత్తాయి. డేనియల్ తుపానుతో కారణంగా ఆ దేశంలో వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. వీటి కారణంగా లిబియాలోని డెర్నా నగరంలో దాదాపుగా 25 శాతం తుడిచిపెట్టుకుపోయింది. అంతే కాకుండా.. ఈ ప్రమాదంలో సుమారు 20 వేల మంది చనిపోయి ఉండొచ్చని స్థానిక మేయర్ తెలిపారు. 

డెర్నా నగరంలోని వీధులతో పాటు సముద్ర తీరం వెంబడి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంతటి విధ్వంసాన్ని సృష్టించిన వరదలపై స్థానికులు మాట్లాడుతూ.. "ఈ ఆదివారం డెర్నా నగరంలో సునామీ లాంటి వరద సంభవించింది. తమని తాము రక్షించుకునే లోపే నీటి ఉధృతి ప్రజలందర్ని లాక్కెళ్లింది" అన్నారు.  

సునామీని పోలిన వరదల్లో వేలాది మంది ప్రజలు తప్పిపోయారు. ఎక్కడ చూసిన మృతదేహాలు కనిపిస్తున్నాయి. ప్రాణాలతో ఉన్న వారంతా తమ ప్రియమైన వారి కోసం వెతులాడుతున్నారు. ఈ వరదల కారణంగా డెర్నాలోని రెండు నీటి డ్యామ్‌లు ధ్వంసమయ్యాయి. ఇంతటి భారీ విపత్తు కారణంగా డెర్నాలో భారీ ప్రాణం నష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. 

Also Read: CM Breakfast Scheme: సీఎం కేసీఆర్ మరో సూపర్ స్కీమ్.. రాష్ట్రంలో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్  

దాదాపుగా 90 వేల జనాభా కలిగిన డెర్నా నగరంలో వేలాది మంది గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంటున్నారు. వీధులు, శిథిలమైన భవానాలు, కార్లు, సముద్ర తీరాలు, నదులు, మురుగు నీటి కాలువల్లో మృతదేహాలు కుప్పలుకుప్పలుగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ డేనియల్ తుపాను ధాటికి గల్లంతైన ప్రజల ఆచూకీ లభ్యం అవ్వడానికి మరింత సమయం పట్టొచ్చని తెలుస్తోంది. అందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు లిబియా అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబు లమోషా అన్నారు.

Also Read: Man Caught Spitting On Food: ఫుడ్ పార్సెల్‌పై ఉమ్మేసిన డెలివరి బాయ్.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News