Bf.7 Variant Scare: మోగుతున్న డేంజర్ బెల్స్.. కేవలం 20 రోజుల్లో 250 మిలియన్ల మందికి కొవిడ్

250 Mn COVID cases: లీక్ అయిన డాక్యుమెంట్స్ ప్రకారం చైనాలో కరోనా కేసులపై ఆ దేశానికి చెందిన హెల్త్ కమిషన్ 20 నిమిషాల పాటు చర్చించినట్టు తెలుస్తోంది. డిసెంబర్ నెలలో మొదటి 20 రోజుల్లోనే దాదాపు 248 మిలియన్ల మంది కరోనావైరస్ బారినపడ్డారని లీక్ అయిన డాక్యుమెంట్స్ స్పష్టంచేస్తున్నాయి.

Written by - Pavan | Last Updated : Dec 24, 2022, 05:02 PM IST
Bf.7 Variant Scare: మోగుతున్న డేంజర్ బెల్స్.. కేవలం 20 రోజుల్లో 250 మిలియన్ల మందికి కొవిడ్

250 Mn COVID cases: కరోనావైరస్ మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా చైనాలో పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. చైనాలో డిసెంబర్ మొదటి వారంలో జీరో కొవిడ్ పాలసీ ఎత్తేసిన తరువాత అక్కడ కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. చైనాలో డిసెంబర్ 1 నుండి 20వ తేదీ వరకు కేవలం 20 రోజుల వ్యవధిలోనే సుమారు 250 మిలియన్ల మంది కరోనా వైరస్ బారినపడ్డారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన గణాంకాలను లీక్ చేస్తూ తాజాగా ఓ డాక్యుమెంట్ సోషల్ మీడియాలో లీక్ అవడం, అది వైరల్ గా మారడం చైనాలో ఆందోళనకర వాతావరణానికి దారితీసింది. చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చెప్పేందుకు ఈ ఉదంతం చక్కటి ఉదాహరణగా మారింది.

లీక్ అయిన డాక్యుమెంట్స్ ప్రకారం చైనాలో కరోనా కేసులపై ఆ దేశానికి చెందిన హెల్త్ కమిషన్ 20 నిమిషాల పాటు చర్చించినట్టు తెలుస్తోంది. డిసెంబర్ నెలలో మొదటి 20 రోజుల్లోనే దాదాపు 248 మిలియన్ల మంది కరోనావైరస్ బారినపడ్డారని లీక్ అయిన డాక్యుమెంట్స్ స్పష్టంచేస్తున్నాయి. చైనాలో 20 రోజుల్లో కరోనా వైరస్ సోకిన వారు చైనా జనాభాలో 17.65 శాతానికి సమానం కావడం గమనార్హం. చైనాకు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టు చైనాలో గురువారం రేడియో ఫ్రీ ఏషియాతో మాట్లాడుతూ.. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ సమావేశానికి హాజరైన వారిలో ఒకరు ఈ డాక్యుమెంట్స్ లీక్ చేశారని.. ఉద్దేశపూర్వకంగానే, ప్రజా ప్రయోజనార్థనే వారు ఈ పని చేసి ఉండొచ్చని అన్నారు. 

ఒక్క రోజుకు 3 మిలియన్ల కరోనా కేసులు
బ్రిటన్‌కి చెందిన ఎయిర్ఫినిటీ అనే హెల్త్ డేటా సంస్థ చైనాలో జరిపిన అధ్యయనంలో భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి. చైనాలో జనవరి నాటికి ఒక్క రోజుకు 3 మిలియన్ల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఒక్క రోజుకు 5 వేల మంది కరోనాకు బలయ్యే ప్రమాదం ఉందని హెల్త్ డేటా ఫర్మ్ అధ్యయనం హెచ్చరిస్తోంది. చైనాలోని బీజింగ్, గ్వాంగ్‌డాంగ్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసులు అతివేగంగా పెరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి : India's COVID Cases: దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్స్

ఇది కూడా చదవండి : Omicron B.7 Variant: దేశంలో ఒమిక్రాన్ బి.7 వేరియంట్, మాస్క్, ఐసోలేషన్, వర్క్ ఫ్రం హోం , లాక్‌డౌన్ మళ్లీ రానున్నాయా

ఇది కూడా చదవండి : Free Ration Scheme: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 2023 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News