BF.7 Variant Cases in India: వామ్మో.. చైనాను హడలెత్తిస్తున్న వేరియంట్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది

BF.7 Variant Cases in India: వదోదరలోని ఎన్నారై మహిళతో పాటు అహ్మెదాబాద్‌లోని గోటా ఏరియాకు చెందిన మరో వ్యక్తిలోనూ బిఎఫ్.7 వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇటీవలే అహ్మెదాబాద్‌కి వచ్చిన సదరు వ్యక్తికి తొలుత కొవిడ్-19 ఇన్‌ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు.

Written by - Pavan | Last Updated : Dec 21, 2022, 06:44 PM IST
BF.7 Variant Cases in India: వామ్మో.. చైనాను హడలెత్తిస్తున్న వేరియంట్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది

BF.7 Variant Cases in India: చైనాను హడలెత్తిస్తున్న బిఎఫ్.7 వేరియంట్ తాజాగా ఇండియాలోనూ వెలుగుచూసింది. చైనాలో ఇటీవల కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరిగేందుకు కారణమైన బిఎఫ్ 7 వేరియంట్‌ను తాజాగా గుజరాత్‌లోని వదోదర, అహ్మెదాబాద్‌లో గుర్తించారు. వదోదరలోని సభాన్‌పుర ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒక ఎన్నారై మహిళకు బిఎఫ్.7 వేరియంట్ సోకినట్టు తేలింది. వదోదర మునిసిపల్ కమిషనర్ బచ్చానిధి పాని వెల్లడించిన వివరాల ప్రకారం డిసెంబర్ 9న అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై మహిళకు డిసెంబర్ 18న కొవిడ్-19 సోకినట్టు గుర్తించారు. ఆ మహిళ శాంపిల్స్‌ని జినోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించగా.. బుధవారమే ఆ శాంపిల్ రిపోర్ట్ వచ్చింది. జినోమ్ సీక్వెన్సింగ్ రిపోర్టు ప్రకారం మహిళకు బిఎఫ్.7 వేరియంట్ సోకినట్టు వెల్లడైంది.

ఆ మహిళ అమెరికా నుంచి వచ్చిన అనంతరం కాంటాక్టులోకి వచ్చిన వారిలో ఇద్దరి శాంపిల్స్ సేకరించి జినోమ్ సీక్వెన్సింగ్ కి పంపించారు. వారి జినోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. 

ఇదే కాకుండా అహ్మెదాబాద్‌లోని గోటా ఏరియాకు చెందిన మరో వ్యక్తిలోనూ బిఎఫ్.7 వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇటీవలే అహ్మెదాబాద్‌కి వచ్చిన సదరు వ్యక్తికి తొలుత కొవిడ్-19 ఇన్‌ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. ఆ తరువాత అతడి శాంపిల్స్ సేకరించి జినోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించగా.. అతడికి కూడా బిఎఫ్.7 వేరియంట్ సోకినట్టు తేలింది. దీంతో గుజరాత్‌లోనే రెండు బిఎఫ్.7 వేరియంట్ కేసులు నమోదైనట్టయింది. ఈ వేరియంట్ కారణంగానే చైనాలో కరోనావైరస్ విలయ తాండవం చేస్తోంది.

ఇది కూడా చదవండి : Coronavirus In China: చైనాలో మళ్లీ కరోనా విలయతాండవం.. లక్షల్లో మరణాలు..!

ఇది కూడా చదవండి : Covid19 Review: కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష, మళ్లీ ఆంక్షలు, లాక్‌డౌన్ తప్పదా

ఇది కూడా చదవండి : India Covid Update: మళ్లీ పంజా విసురుతున్న కరోనా.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News