ఇటలీలో వందకు పైగా వైద్యుల మృతి..

కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ఇటలీలో భారీ సంఖ్యలో మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. లక్షల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, నిత్యం వందల సంఖ్యలో మరణాలతో ఇటలీ దేశం మృతులదిబ్బగా మారిపోయింది.

Last Updated : Apr 10, 2020, 07:57 PM IST
ఇటలీలో వందకు పైగా వైద్యుల మృతి..

రోమ్: కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ఇటలీలో భారీ సంఖ్యలో మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. లక్షల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, నిత్యం వందల సంఖ్యలో మరణాలతో ఇటలీ దేశం మృతులదిబ్బగా మారిపోయింది. గత యాభై రోజులుగా ఇప్పటివరకు ఇటలీలో 100 మందికి పైగా నిపుణులైన వైద్యులు కరోనా మహమ్మారి బారినపడి మరణించడం పరిస్థితి ఎంత క్లిష్టతరమైందో ఊహకందని విషయమని ఓ అధికారి తెలిపారు. మరోవైపు మరణించిన వైద్యుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.

అత్యవసర పరిస్థితిని అదుపులో ఉంచడానికి ప్రజలకు చికిత్స చేయడానికి వచ్చి మరణించినవారిలో పదవీ విరమణ చేసిన వైద్యులు కూడా ఉన్నారని, ఇది విషాదకరమని అన్నారు. ప్రాథమిక దశలో ఉన్న సమయంలో కరోనా విజృంభిస్తుండడంతో ఇటలీ ప్రభుత్వం పదవీవిరమణ చేసిన డాక్టర్ల సేవలు కూడా వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది. రోజుకు వేల సంఖ్యలో రోగులు వస్తుండడంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయినా తరుణంలో వైద్యులకు సరైన రక్షక కవచ దుస్తులు కూడా అందించలేక ఇటలీ ప్రభుత్వం విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయిందని వివిధ సంస్థలు పేర్కొన్నాయి. కాగా ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధికంగా ఇటలీలో 17,669 మంది కరోనాతో మరణించడంతో తీవ్ర ఆందోళనల్లో జీవనం కొనసాగిస్తున్నారు. 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Also Read: కరోనాపై పోరాటానికి రోహిత్ శర్మ భారీ విరాళం

Trending News